Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.3లకే బిర్యానీ ప్యాకెట్‌.. కట్ చేస్తే

రూ.3లకే బిర్యానీ ప్యాకెట్‌.. కట్ చేస్తే

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 30, 2024 | 1:09 PM

బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి... ఫ్రెండ్‌ సర్కిల్‌లో ఎవరిదైనా పుట్టినరోజు వచ్చిందంటే ఆ గ్యాంగ్‌కి ఇక పండగే. ఊరికే బిర్యానీ తినొచ్చుకదా...అలాంటి ఆఫరే డైరెక్ట్‌గా ఓ రెస్టారెంట్‌ ప్రకటించింది. రూ.3లకే బిర్యానీ ప్యాకెట్‌ అంటూ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫర్ ప్రకటించడంతో బిర్యానీ ప్రియులు రెస్టారెంట్‌కు పోటెత్తారు.

బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి… ఫ్రెండ్‌ సర్కిల్‌లో ఎవరిదైనా పుట్టినరోజు వచ్చిందంటే ఆ గ్యాంగ్‌కి ఇక పండగే. ఊరికే బిర్యానీ తినొచ్చుకదా…అలాంటి ఆఫరే డైరెక్ట్‌గా ఓ రెస్టారెంట్‌ ప్రకటించింది. రూ.3లకే బిర్యానీ ప్యాకెట్‌ అంటూ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫర్ ప్రకటించడంతో బిర్యానీ ప్రియులు రెస్టారెంట్‌కు పోటెత్తారు. కానీ ఆ ఆఫర్‌ కేవలం 3 గంటలు మాత్రమే అమలులో ఉంటుందని తెలిసి చాలామంది తమకు బిర్యానీ దొరుకుతుందో లేదోనని తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ఆఫర్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో నూతనంగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్లో పెట్టారు. భీమడోలు, తాడేపల్లిగూడెంలో ఇప్పటికే ఈ సంస్థకు రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో మరో కొత్త బ్రాంచ్ ని ఏర్పాటు చేసింది. రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. మూడు రూపాయలకే బిర్యానీ అంటూ వారం రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పబ్లిసిటీ చేశారు. మామూలుగానే బిర్యానీ అంటే ఎగబడి తింటారు. అలాంటిది మూడు రూపాయలకు బిర్యానీ అంటే ఆగుతారా… దీంతో బిర్యానీ ప్రియులు భారీగా రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. మూడు రూపాయల ఆఫర్ కోసం రెస్టారెంట్ బయట యాజమాన్యం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసింది. క్యూలైన్లో వచ్చి 3 రూపాయలు చెల్లిస్తే చాలు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేశారు. అయితే క్యూ లైన్ లలో తోపులాట, ఘర్షణలు జరగకుండా ప్రైవేట్ సెక్యూరిటీని సైతం రెస్టారెంట్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ ఆఫర్ కేవలం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉండడంతో ఆఫర్ వినియోగించుకోలేని ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రతన్‌ టాటాలా వ్యాపారం ఇంకెవరైనా చెయ్యగలరా ??

అమ్మో.. 550 కోట్లే !! హీరోలకు మించి సంపాదిస్తున్న ఆలియా !!

దిమ్మతిరిగే న్యూస్ !! స్టార్ హీరో సినిమాలో విలన్‏గా వార్నర్‌

ఆ హీరోయిన్‌ తో నారా రోహిత్ పెళ్లి ?? డేట్ ఫిక్స్ !!

ఒకే ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేసిన రతన్.. మళ్లీ ఆ వైపు ఎందుకు చూడలేదు ??

Published on: Oct 11, 2024 12:32 PM