Chennai Railway Police dance: కరోనా మహమ్మారి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. కరోనా నుంచి రక్షించుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం.. నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా, ప్రజల్లో చాలా వరకూ నిర్లక్ష్యం రాజ్యం ఏలుతోంది. కొన్ని విషయాలను నిర్వర్తించడానికి చాలామంది ప్రజలు ఇష్టపడటం లేదు. మాస్క్ ధరించడం విషయంలో ఎక్కువ శాతం మంది అది తమకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు చెబుతున్నారు. మాస్క్ ధరించడానికి విముఖత చూపిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఏదో పెట్టుకున్నాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇక చేతులు శుభ్రం చేసుకోవడం గురించి కూడా ఇదే విధంగా చేస్తున్నారు. తరచూ చేతులు సబ్బునీటితో శుభ్రం చేసుకుంటూ వుండాలని ఎంతగా చెప్పినా బద్ధకిస్తున్నారు.
ఇటువంటి వారికి పదే పదే కరోనా జాగ్రత్తల గురించి చెబుతూ వస్తున్నారు పోలీసు సిబ్బంది. బెదిరించి.. బతిమాలి అన్ని రకాలుగానూ ప్రజలను జాగ్రత్తగా ఉండమని కోరుతున్నారు. అప్పుడప్పుడు ప్రజలకు ఇష్టమైన డాన్స్ రూపంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. ఒక హిట్ పాటను తీసుకుని దానిని కరోనా జాగ్రత్తలకు అన్వయించి ఎక్కువ మంది జనం ఉన్న చోట డ్యాన్స్ ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చెన్నై రైల్వే పోలీసులు ఇటువంటి ప్రయత్నమే చేశారు. ఇప్పుడు ఆ వీడియో ట్రెండింగ్ గా మారింది.
తమిళనాడులో COVID-19 కేసులు పెరగడంతో, చెన్నై రైల్వే పోలీసులు ఇటీవల మహమ్మారి గురించి అవగాహన పెంచడానికి ఒక నృత్య ప్రదర్శనతో వచ్చారు. ఆ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. యూనిఫాం ధరించి, ఫేస్ మాస్క్‌లు, గ్లౌజులు ధరించి, రైల్వే విభాగానికి చెందిన పలువురు మహిళా పోలీసు అధికారులు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో కోవిడ్ -19 పై అవగాహన పెంచడానికి డాన్స్ చేశారు. ఎంజాయ్ ఎంజామితో సహా పలు ప్రసిద్ధ పాటలకు కరోనా జాగ్రత్తల సందేశాల్ని జోడించి డ్యాన్స్ చేయడం ఆ వీడియోలో కనిపించింది. రైల్వే పోలీసుల ఈ డాన్స్ లు స్టేషన్‌లోని చాలా మంది ప్రయాణికులను ఆనందపరిచాయి. క్లిప్ త్వరలో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో, చాలామంది ఈ వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు. పోలీసు అధికారులు చేస్తున్న మంచి ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.
ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు..
Chennai Railway Police viral dance performance to popular Enjaai Enjaami song to raise awareness about #COVID19 at MGR Chennai Central Railway station.@MoHFW_INDIA @COVIDNewsByMIB @RailMinIndia @GMSRailway @RPF_INDIA @rpfsrmas @arunkumar783 @Subramanian_ma @RAKRI1 @PIB_India pic.twitter.com/gyoh5Z36X1
— PIB in Tamil Nadu ?? (@pibchennai) May 9, 2021
ఇటీవల, కేరళ పోలీసులు కూడా కోవిడ్ -19 మహమ్మారి గురించి అవగాహన కల్పించడానికి ఒక డ్యాన్స్ వీడియోను విడుదల చేసిన విషయం విదితమే. . “ఎంజాయ్ ఎంజామి” తో చాలా మంది పోలీసు సిబ్బంది నృత్యం చేశారు. ఏదేమైనా, ముసుగును సరిగ్గా ధరించడం, సామాజిక దూరాన్ని నిర్వహించడం మరియు హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడటానికి సాహిత్యం తిరిగి రూపొందించారు ఈ పాటలో.
Also Read: SASIKALA RE-ENTRY: చిన్నమ్మ తెరచాటు రాజకీయం షురూ.. చెన్నై ఆఫీసు ఎదుట శశికళ అనుకూల వర్గం ఏంచేసిందంటే?
Workouts: సముద్రం అడుగున వ్యాయామం.. పాండిచ్చేరి యువకుని సాహసం.. ఇదంతా అందుకోసమే!