Viral: పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో లోపలికి..
వన్యప్రానులను దగ్గరనుంచి చూడాలంటే జూకో లేక సఫారీకో వెళ్లినప్పుడే సాధ్యమవుతుంది. సఫారీలకు వెళ్లినప్పుడు పర్యాటకులకు వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. అక్కడి జంతువులను దగ్గరనుంచి చూస్తారు. ఆ జంతువులు కూడా వారిని ఏమీ చేయవు. వారంతా తమ మిత్రులే అన్నట్టుగా పర్యాటకుల వాహనాలపైకి ఎక్కి అవి కూడా కాసేపు ఎంజాయ్ చేస్తాయి.
వన్యప్రానులను దగ్గరనుంచి చూడాలంటే జూకో లేక సఫారీకో వెళ్లినప్పుడే సాధ్యమవుతుంది. సఫారీలకు వెళ్లినప్పుడు పర్యాటకులకు వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. అక్కడి జంతువులను దగ్గరనుంచి చూస్తారు. ఆ జంతువులు కూడా వారిని ఏమీ చేయవు. వారంతా తమ మిత్రులే అన్నట్టుగా పర్యాటకుల వాహనాలపైకి ఎక్కి అవి కూడా కాసేపు ఎంజాయ్ చేస్తాయి. కానీ ఆ సమయంలో పర్యాటకుల గుండె దడదడలాడుతుంది. ఏ క్షణంలో దాని మూడ్ మారి తమపై దాడి చేస్తుందోనని భయపడుతుంటారు. తాజాగా బెంగళూరులో సఫారీల వ్యానుపై చిరుత ఎటాక్ చేసింది. దాంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు పర్యాటకులు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు షాకవుతున్నారు.
బెంగళూరు నగర శివారు బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనానికి పర్యాటకులతో ఓ మినీ బస్సు వచ్చింది. అలా పార్క్‌లో జంతువులను చూపిస్తూ బస్సు ముందుకు కదులుతోంది. ఇంతలో ఓ చిరుత ఒక్కసారిగా బస్సుమీద ఎటాక్ చేసింది. ఆ మినీబస్సు కిటికీ ఓపెన్ చేసి ఉండటంతో అందులోంచి బస్సులోకి ప్రవేశించేందుకు చిరుత ప్రయత్నించింది. దాంతో బస్సులోని పర్యాటకులు భయంతో కేకలు వేశారు. చిరుత పదే పదే బస్సు ఎక్కే ప్రయత్నం చేసింది. అయితే కిటికీకి గ్రిల్ ఏర్పాటు చేసి ఉండటంతో దానికి సాధ్యం కాలేదు. చిరుత పదే పదే కిటికీపైకి దూకుతూ.. గ్రిల్ మెష్‌ను తొలగించేందుకు యత్నించడంతో బస్సులోని పర్యాటకులు భయపడ్డారు. వెనకే వస్తున్న మరో సఫారీ బస్సులోని ప్రయాణికులు ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను తీశారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అయితే పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పర్యాటకులు ఒకింత భయపడినా ఆ తర్వాత చిరుతను అంత దగ్గరగా చూసినందుకు ఆనందంతో కేరింతలు కొట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.