ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ పురోగతి ఏ దశలో ఉందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో జగన్ అక్రమాస్తులకు సంబందించి దాఖలైన అన్ని కేసుల వివరాలను ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.