చాట్‌జీపీటీ అద్భుతం.. 17 మంది డాక్టర్ల వల్ల కాని పని చేసి చూపిందట
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఎలాంటి ప్రశ్నలకైనా సులువుగా సమాధానం చెప్పే చాట్‌జీపీటీ గురించి.. అది చూపించిన పరిష్కారాల గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అయితే అందులో ఎంత నిజం ఉందన్నది ప్రశ్నే అని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. కోర్ట్నీ అనే మహిళకు ఒక 4 ఏళ్ల కొడుకు అలెక్సా ఉన్నాడు. అయితే బాలుడికి మూడేళ్లుగా ఉన్న అనారోగ్యానికి గల కారణం ఏంటో ఆమె తెలుసుకోలేకపోయింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఎలాంటి ప్రశ్నలకైనా సులువుగా సమాధానం చెప్పే చాట్‌జీపీటీ గురించి.. అది చూపించిన పరిష్కారాల గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అయితే అందులో ఎంత నిజం ఉందన్నది ప్రశ్నే అని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. కోర్ట్నీ అనే మహిళకు ఒక 4 ఏళ్ల కొడుకు అలెక్సా ఉన్నాడు. అయితే బాలుడికి మూడేళ్లుగా ఉన్న అనారోగ్యానికి గల కారణం ఏంటో ఆమె తెలుసుకోలేకపోయింది. ఎన్ని ఆస్పత్రులు, ఎంత మంది డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేకుండా పోయింది. కరోనా మహమ్మారి వెలుగు చూసిన సమయంలో అనారోగ్యానికి గురైన అలెక్సాను 3 సంవత్సరాల నుంచి 17 మంది డాక్టర్లు పరిశీలించారు. అయినా అతనికి ఉన్న రోగం ఏంటో ఎవరూ గుర్తించలేకపోయారు. చివరికి కోర్ట్నీకి ఏం చేయాలో తెలియక కంప్యూటర్‌లో చాట్‌జీపీటీలో వెతకడం ప్రారంభించింది. రోజు మొత్తం అందులో తన కుమారుడికి వచ్చిన రోగం గురించి.. దాని లక్షణాల గురించి సెర్చ్ చేసింది. ఈ క్రమంలోనే తన కుమారుడికి వచ్చిన జబ్బును గుర్తించింది. ఏం తిన్నా పంట్లో నొప్పి, కొడుకు ఎత్తు పెరగకపోవటం వంటి వింత లక్షణాలు అలెక్సాకు ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిప్స్ తిని అస్వస్థతకు గురై చనిపోయిన బాలుడు.. ఛాలెంజ్‌లో భాగంగా ఘటన
ESI హాస్పిటల్‌లో దారుణం.. లిఫ్టు ఎక్కడమే పాపమైంది
అంతిమ యాత్రలో అపశ్రుతి.. మృతదేహాన్ని వదిలేసి వెళ్లిన బంధువులు
స్కూటీలో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో తెలుసా ??
Anushka Shetty: 17 ఏళ్ల తర్వాత నెరవేరబోతున్న అనుష్క కల