బాబోయ్.. ప్యాంట్ జేబులో పేలిన సెల్‌ఫోన్ !! పాపం చివరికి ఏమైందంటే ??
నంద్యాల జిల్లా డోన్‌లో సెల్‌ఫోన్ పేలుడు ఘటన కలకలం రేపింది. వివో సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో వ్యక్తి చేతికి, తొడకి తీవ్ర గాయాలయ్యాయి.
నంద్యాల జిల్లా డోన్‌లో సెల్‌ఫోన్ పేలుడు ఘటన కలకలం రేపింది. వివో సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో వ్యక్తి చేతికి, తొడకి తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్ నగర్ కాలనీకి చెందిన నాగేంద్ర..పాత బస్టాండ్ దగ్గర టీ తాగి ఇంటికి వెళ్తుండగా, టీచర్స్ కాలనీలోని శారదా కాన్వెంట్ దగ్గరికి రాగానే ప్యాంట్ జేబులో ఉన్న ఫోన్ రింగైంది. ఫోన్ మాట్లాడి తన ప్యాంట్ జేబులో పెట్టుకుని కొద్ది దూరం వెళ్లగానే బ్లాస్ట్ అయ్యింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఫోన్ పేలడంతో నాగేంద్ర ఒంటిపై మంటలు వచ్చాయి. నాగేంద్ర ఒంటిపై మంటలను ఆర్పివేశారు. సెల్ ఫోన్ దూరంగా విసిరేశారు స్థానికులు. జేబులో ఉన్న సెల్ ఫోన్.. బాంబులా పేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. బాధితుడితో పాటు స్థానికులు షాక్ కి గురయ్యారు. సెల్ ఫోన్ కంపెనీపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం ఉత్పత్తులు తీసుకున్నా, సరిగ్గా వినియోగించకపోయినా ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి వేదికపై వరుడికి అవమానం.. వధువు నవ్వడంచూసి వరుడు ఏంచేశాడో తెలుసా ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

