Filming Minors: విమానం టాయిలెట్‌లో సీక్రెట్‌గా రికార్డింగ్.! అటెండెంట్ అరెస్ట్
మైనర్ బాలికలు టాయిలెట్‌లో ఉండగా రహస్యంగా రికార్డు చేసిన ఫ్లైట్ సిబ్బంది ఒకరిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్‌లైన్స్ సంస్థ పైనా కేసు బుక్ చేశారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో గతేడాది ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మీడియా కథనాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాకు చెందిన ఎయిర్‌లైన్స్ నార్త్ కరోలినాలోని షార్లెట్ నుండి బోస్టన్‌కు వెళ్తోంది.
మైనర్ బాలికలు టాయిలెట్‌లో ఉండగా రహస్యంగా రికార్డు చేసిన ఫ్లైట్ సిబ్బంది ఒకరిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్‌లైన్స్ సంస్థ పైనా కేసు బుక్ చేశారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో గతేడాది ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీడియా కథనాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాకు చెందిన ఎయిర్‌లైన్స్ నార్త్ కరోలినాలోని షార్లెట్ నుండి బోస్టన్‌కు వెళ్తోంది. విమానంలో అటెండెంట్‌గా పనిచేస్తున్న ఎస్టెస్ కార్టర్ థామ్సన్ అనే 34 ఏళ్ల వ్యక్తి మైనర్ బాలికలు బాత్రూమ్‌లో ఉండగా రహస్యంగా తన ఫోన్‌లో రికార్డు చేస్తున్నట్లు గుర్తించారు. 14 ఏళ్ల మైనర్ బాలిక టాయిలెట్‌కు వెళ్లింది. అయితే, పక్కనే ఉన్న బాత్రూమ్ బాలేదని చెప్పి.. ఫస్ట్ క్లాస్ సెక్షన్‌లోని బాత్రూమ్‌కు పంపించాడు. అందులో ముందుగానే తన సెల్‌ఫోన్‌ను టేపుతో గోడకు అంటించి పెట్టాడు. బాత్రూమ్‌లోకి వెళ్లిన బాలిక అక్కడ సెల్‌ఫోన్‌ను గుర్తించి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధిత కుటుంబం ఈ ఘటనపై సిబ్బందికి ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తొమ్మిదేళ్ల బాలిక సహా నలుగురు మైనర్లను నిందితుడు వీడియో తీసినట్లు గుర్తించారు. గతేడాది జనవరి- ఆగస్టు మధ్య కాలంలో నిందితుడు.. 7, 9, 11, 13 ఏళ్ల వయసున్న నలుగురు చిన్నారులను సీక్రెట్‌గా రికార్డు చేసినట్టు వెల్లడైంది. అతడి ఐక్లౌడ్ అకౌంట్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయి. లైంగిక వేధింపులకు యత్నించడం, చైల్డ్ పోర్నోగ్రఫీ నేరాల కింద పోలీసులు నిందితుడిపై కేసులు నమోదు చేశారు. జనవరి 18న నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎయిర్‌లైన్స్ సంస్థపైన కూడా కేసు బుక్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

