Debit or Credit Card: పిల్లలకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ను ఇవ్వొచ్చా.? నిపుణులు ఏమంటున్నారు.?
బ్యాంకులు పిల్లలకు డెబిట్ కార్డ్‌లు, బ్యాంక్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి క్రెడిట్ కార్డ్‌లు అనుమతించడం లేదు. అయితే
బ్యాంకులు పిల్లలకు డెబిట్ కార్డ్‌లు, బ్యాంక్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి క్రెడిట్ కార్డ్‌లు అనుమతించడం లేదు. అయితే కొన్ని కొత్త ఫిన్‌టెక్ కంపెనీలు పిల్లల కోసం ప్రీపెయిడ్ కార్డులను అందిస్తున్నాయి. వీటిని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డులను పిల్లలకు ఇస్తే.. వారు ఖర్చులను, ఆర్థిక వ్యవహారాలను సమర్థంగా నిర్వహించగలరా? అనే అనుమానం చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పడం తప్పుకాదు. పిల్లలకు డబ్బు గురించి చిన్న వయస్సు నుండే తెలుసుకునేలా చేయడం ఎంతైనా అవసరం. పెట్టుబడికి సంబంధించిన ప్రాథమిక విషయాలను అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడుతుంది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగించాలో పిల్లలకు నేర్పించడం తెలివైన పని అని నిపుణులు అంటున్నమాట.మునుపటి తరాలకంటే నేటి పిల్లలు టెక్నాలజీ పరంగా ఫాస్ట్‌గా ఉన్నారు. కానీ డబ్బుల విషయానికొస్తే వారు పెద్దల నుంచి చాలా నేర్చుకోవాలి. అయితే పిల్లలకు డెబిట్, క్రెడిట్ కార్డును సొంతంగా నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలా అన్న విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పేరంట్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..