Adult Pictures Business: నగ్న చిత్రాలతో వ్యాపారం.. ఒక్కో ఆకృతికి ఒక్కో ధర..! వీడియో..
పేదల మహిళల ఆర్ధిక ఇబ్బందులను ఆసరాగా తీసుకొని దారుణాలకు ఒడిగడుతున్న ఓ కేటుగాడి ఆట కట్టించారు చాంద్రాయణగుట్ట పోలీసులు. మహిళలకు డబ్బు ఆశ చూపి వారి నగ్న ఫోటోలు
పేదల మహిళల ఆర్ధిక ఇబ్బందులను ఆసరాగా తీసుకొని దారుణాలకు ఒడిగడుతున్న ఓ కేటుగాడి ఆట కట్టించారు చాంద్రాయణగుట్ట పోలీసులు. మహిళలకు డబ్బు ఆశ చూపి వారి నగ్న ఫోటోలు వీడియోలు తీసి కర్నాటక బీదర్ జిల్లా కలబురిగి ప్రాంతానికి చెందిన గులాం అనే వ్యభిచార ముఠా నాయకుడికి పంపించేవాడు. ఓ బాధితురాలిద్వారా విషయం తెలుసుకున్న ఓ మహిళా సామాజిక కార్యకర్త పక్కా ప్లాన్‌తో నిందితుడిని పోలీసులకు పట్టించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది.కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా, బసవకల్యాణ్ తాలూకా, రాజేశ్వర్ గ్రామానికి చెందిన సయ్యద్ హుస్సేన్ లారీడ్రైవర్. కలబురిగి ప్రాంతానికి చెందిన వ్యభిచార గృహాల నిర్వాహకుడు గులాంకు ప్రధాన అనుచరుడు. గులాం ఆదేశంతో పేద మహిళలలే లక్ష్యంగా వారం రోజుల క్రితం హుస్సేన్ పాతబస్తీ చేరాడు. పనికోసం వచ్చానంటూ బార్కస్‌సలాలాలో ఉంటున్న తన మరదలి ఇంటికి చేరాడు. ఆమెతో పని వెతుక్కోడానికి వెళ్తున్నానని చెప్పి మరో మహిళతో కలిసి వ్యభిచార కార్యకలాపాలకు అనువుగా ఉండే యువతుల కోసం గాలించేవారు. కష్టాలు తొలగించే ఉపాయం తన వద్ద ఉందంటూ మహిళలకు మాటలతో గాలం వేసి, తన గదికి తీసుకొచ్చేవాడు. వారి ముఖం, పాదాలు కనిపించకుండా సెల్‌ఫోన్‌లో వారి మిగిలిన శరీర భాగాల చిత్రాలు, వీడియోలు తీసేవాడు. వాటిని కలబురిగిలోని గులాంకు వాట్సప్ ద్వారా పంపించేవాడు. వాటిని చూసి గులాం వారికి ధర నిర్ణయించేవాడు. వారం రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా మహిళల వివరాలు కలబురిగి చేరవేశాడు. వీరిలో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువతులున్నట్టు సమాచారం. హుస్సేన్ ఆగడాలన్నీ తెలుసుకున్న ఓ సామాజిక కార్యకర్త హుస్సేన్ పనిపట్టేందుకు రంగంలోకి దిగింది. మరో మహిళతో కలసి ఆమె అతడి హుస్సేన్ గదికి వెళ్లారు. పొట్టిగా ఉన్నావని.. ఆమెను అతడు తిరస్కరించాడు. పక్కనే ఉన్న మరో మహిళను మీరు రేపు అందంగా తయారై వస్తే ఫొటోలు, వీడియోలు తీసి ధర నిర్ణయిస్తానని చెప్పాడు. పక్కా ప్లాన్‌తో రెడీగా ఉన్న చాంద్రాయణగుట్ట పోలీసులు బార్కస్ చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హుస్సేన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి సెల్‌ఫోన్‌లో వీడియోలు, చిత్రాలున్నట్లు గుర్తించారు. బీదర్ కేంద్రంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలకు నగరం నుంచి పెద్దఎత్తున మహిళలు, యువతులు, బాలికలను కొనుగోలు చేసి చేరవేస్తున్నట్టు అంచనాకు వచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్‌పాట్.. ఒకే సారి
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

