Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bridge Video: వంతెనను కూల్చుతున్న బుల్డోజర్‌.. ఇంతలో ఊహించని సీన్‌.. అమ్మని డ్రైవరో..

Bridge Video: వంతెనను కూల్చుతున్న బుల్డోజర్‌.. ఇంతలో ఊహించని సీన్‌.. అమ్మని డ్రైవరో..

Anil kumar poka

|

Updated on: Nov 02, 2022 | 10:20 PM

చెడపకురా చెడేవు అని సామెత.. పలు సందర్భాల్లో ఈ సామెతను పెద్దలు వాడుతూ ఉండటం మనం విన్నాం. అందుకు చక్కని ఉదాహరణగా ఈ వీడియోను చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో


చెడపకురా చెడేవు అని సామెత.. పలు సందర్భాల్లో ఈ సామెతను పెద్దలు వాడుతూ ఉండటం మనం విన్నాం. అందుకు చక్కని ఉదాహరణగా ఈ వీడియోను చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో శిధిలావస్థలో ఉన్న ఓ పాత వంతెనను కూల్చుతోంది ఓ బుల్డోజర్‌. ఈ క్రమంలో వంతెన సగ భాగం కూలిపోయింది. మిగతా భాగాన్ని కూడా కూల్చేందుకు సిద్ధమౌతున్న బుల్డోజర్‌ ఊహించని విధంగా నీటిలోపడి మునిగిపోయింది. లక్కీగా దాని డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముజఫర్‌నగర్‌లోని జనసత్ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న వంతెనను కూల్చివేయడానికి బుల్డోజర్ వెళ్లింది. వంతెనలోని ఒకవైపు భాగాన్ని బుల్డోజర్ కూల్చేసింది. అయితే ఆ భాగమే కాకుండా వంతెన మొత్తం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ బుల్డోజర్ కూడా నీటిలో పడిపోయింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై తన ప్రాణాలను కాపాడుకుని ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షించగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

 

Published on: Nov 02, 2022 09:51 PM