గుడి చుట్టూ పక్షుల ప్రదక్షిణలు..ఆశ్చర్యంలో స్థానికులు

|

Nov 29, 2024 | 1:49 PM

ప్రకాశంజిల్లా మార్కాపురంలోని శ్రీలక్షీ చెన్నకేశవస్వామి దేవాలయంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆలయం చుట్టూ కొన్ని పక్షులు ప్రదక్షిణ చేశాయి. అది గమనించిన స్థానికులు ఆశ్చర్యపోయారు. కొందరు ఆదృశ్యాన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్‌ చేశారు.

మార్కాపురం పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన రాయలవారి నాటి కాలంలో నిర్మించిన పురాతన దేవస్థానం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. అయితే ఈ ఆలయ గోపురం వద్ద కొన్ని పక్షులు వింతగా ప్రవర్తించాయి. పదుల సంఖ్యలో ఉన్న ఆ పక్షులు ఆలయ ప్రధాన గాలిగోపురం చుట్టూ తిరుగుతూ సందడి చేశాయి. పక్షులు అలా గాలిగోపురం చుట్టూ తిరుగుతుంటే అవి ఎంతో భక్తితో ప్రదక్షిణలు చేస్తున్నాయా అన్నట్టుగా అందరూ ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. పశుపక్ష్యాదులలోనూ ఆథ్యాత్మిక భావనలు ఉంటాయని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈ సమస్యలు తప్పవు అంటున్న శాస్త్రవేత్తలు

Pushpa 02: కెవ్వు కేక.. రిలీజ్‌కు ముందే లీకైన పుష్ప2 రివ్యూ

Pushpa 02: పుష్ప-2 విడుదలకు ముందు ముఖ్యమైన వీడియోను రిలీజ్ చేసిన అల్లు అర్జున్

111 కోట్ల సినిమా.. OTTలో దూసుకుపోతోంది..

వీరి బంధం పూర్తిగా తెగిపోయింది !! ఇక ఎవరి దారి వారిదే !!