111 కోట్ల సినిమా.. OTTలో దూసుకుపోతోంది..
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ సినిమా..! అలాంటి ఈ సినిమా ఎట్ ప్రజెంట్ ఓటీటీలోకొచ్చింది.
నవంబర్ 27 అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. లక్కీ భాస్కర్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా నెట్‌ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించింది. ఈక్రమంలోనే లక్కీ భాస్కర్ మలయాళం సహా ఐదు భాషల్లో విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. ఇదే విషయాన్ని గట్టిగానే ప్రమోట్ చేస్తోంది నెట్‌ఫ్లిక్స్. లక్కీ భాస్కర్, ఎస్ నాగవంశీ, సాయి గెయ్య నిర్మించిన చిత్రం ఇది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమా, శ్రీకరా స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. దుల్కర్ కు జోడీగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. లక్కీ భాస్కర్ దుల్కర్ 32వ సినిమా. ఇక లక్కీ భాస్కర్ కథ 1990 లలో జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగి భాస్కర్ నల్లధనం గురించి తెలుసుకునే కథాంశంతో సాగుతుంది. ఇక 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా.. రిలీజ్ అయిన 26 రోజుల్లోనే దాదాపు 111.76 కోట్లు వసూలు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీరి బంధం పూర్తిగా తెగిపోయింది !! ఇక ఎవరి దారి వారిదే !!
Pushpa 2: కేరళ ఫ్యాన్స్‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్
అది మనసులో పెట్టుకునే.. నయన్‌పై ప్రతీకారమా ??
Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమ కథ !! ఇంటర్ నుంచి సాగుతోందట వీరి లవ్ ముచ్చట!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

