Pushpa 2: కేరళ ఫ్యాన్స్‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మరో వారం రోజుల్లోనే రిలీజ్ ఉండటంతో పుష్ప ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఇప్పటికే పాట్నా, చెన్నైలో భారీ ఈవెంట్స్ నిర్వహించారు…తాజాగా కేరళలోని కొచ్చిలో పుష్ప 2 ఈవెంట్ నిర్వహించారు. కేరళలో బన్నీ సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. అక్కడ బన్నీని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు ఫ్యాన్స్.
కేరళలో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో కేరళలో జరగుతున్న ఈవెంట్‌కు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఎప్పటిలానే బన్నీ క్రేజ్ ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేశారు. గత 20 సంవత్సరాలుగా కేరళ అభిమానులు చూపిస్తున్న ప్రేమకు బన్నీ థ్యాంక్స్ చెప్పారు. పుష్పలో ఫాహాద్ పాజిల్‌తో వర్క్ చేయడం ఆనందకరమన్నారు. ఆర్య సినిమాతోనే మలయాళంలో కూడా తనకు మార్కెట్ మొదలైందని అల్లు అర్జున్ చెప్పారు. ఈ సందర్భంగా కేరళ ఫ్యాన్స్‌కు బన్నీ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చారు. పుష్ప 2 సినిమాలో ఒక సాంగ్ మొదట్లో మలయాళం లిరిక్స్ ఉంటాయన్నారు. అన్ని భాషల్లోనూ ఆ పాటలో లిరిక్స్ మళయాళంలోనే ఉంటాయని బన్నీ వెల్లడించారు. అలాగే ఆ పాట ప్రోమోని కూడా అక్కడ ప్లే చేశారు. అయితే ఇప్పుడీ ప్రోమో క్లిప్ నెట్టింట వైరల్ అవడంతో.. ఇది బన్నీ తన కేరళ ఫ్యాన్స్‌కి ఇచ్చిన సర్‌ప్రైజ్ అండ్ స్పెషల్ గిఫ్ట్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పుష్ప2 నుంచి బయటికి వచ్చిన ఆ మలయాళీ బిట్‌ను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది మనసులో పెట్టుకునే.. నయన్‌పై ప్రతీకారమా ??
Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమ కథ !! ఇంటర్ నుంచి సాగుతోందట వీరి లవ్ ముచ్చట!
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

