చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈ సమస్యలు తప్పవు అంటున్న శాస్త్రవేత్తలు
మామూలుగా వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులు చికెన్ లేదా మటన్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. కార్తీకమాసం అని కొందరు ఆగినా.. నెల మారగానే.. స్టార్ట్ చేస్తారు . చికెన్, మటన్ ను విపరీతంగా తినే వారికి ఇది షాకింగ్ న్యూసే. నాన్ వెజ్ ప్రియులు సాధారణంగా వారాంతాల్లో చికెన్, మటన్ తినకుండా ఉండరు. మటన్ ధర ఎక్కువగా ఉండడంతో చికెన్ షాపుల ముందు క్యూ కడతారు.
కానీ వాళ్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. బ్రాయిలర్ కోళ్లు చాలా ప్రమాదకరమైనవి అని. సో.. వాళ్లు కొంటున్నది ఈ రకం కోళ్లే అయితే కచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే. బ్రాయిలర్ చికెన్ ను తక్కువ ధరకు తీసుకొచ్చి రకరకాలుగా వండుకుని తింటారు. కాని వాళ్లు అలా వండుకుంది బ్రాయిలర్ కోడి అయితే.. సమస్య తప్పదంటున్నారు నిపుణులు. మార్కెట్‌లో బ్రాయిలర్ కోళ్లు ఎక్కువగా అందుబాటులో ఉండడం.. ధర కూడా అన్ని వర్గాల వారికీ సరసంగా ఉండటంతో వాటినే తింటున్నారు. కానీ తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉన్నబ్రాయిలర్ కోళ్ల మాంసాన్ని తినడం చాలా ప్రమాదకరమని ఓ నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్-NIN ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. మాంసాన్ని బాగా ఉడికించాలని.. లేని పక్షంలో మరింత డేంజర్ అని తెలిపింది. తెలంగాణతో పాటు కేరళలో అందుబాటులో ఉన్న కోళ్ల మాంసంలో యాంటీబయోటిక్స్‌ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లు NIN శాస్త్రవేత్తలు గుర్తించారు. కోళ్ల ఫామ్‌లలో కోళ్లకు అవసరం అయినా లేకపోయినా యాంటీబయోటిక్స్ ను ఇష్టం వచ్చినట్టు ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతోందని పరిశోధకులు నిర్ధారించారు. ఇలాంటి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల ఏఎంఆర్ జన్యువు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదం ఉందని ఈ పరిశోధనలో తేల్చారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Pushpa 02: కెవ్వు కేక.. రిలీజ్‌కు ముందే...
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

