Bride-groom: వరుడు చదువుకోలేదని తెలిసి వధువు ఏం చేసిందో చూడండి..! ప్రశంసిస్తున్న నెటిజన్లు..
సాధారణంగా వివాహ వేడుకల్లో చిన్న చిన్న కలహాలు, కాసేపు పెళ్లి ఆగడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. చివరికి ఇరువురు కుటుంబాలు ఏకాభిప్రాయానికి వచ్చి పెళ్లితంతు జరిపిస్తారు. అయితే ఇప్పడు మనం తెలుసుకోబోయే విషయం చాలా విచిత్రమైనది.
సాధారణంగా వివాహ వేడుకల్లో చిన్న చిన్న కలహాలు, కాసేపు పెళ్లి ఆగడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. చివరికి ఇరువురు కుటుంబాలు ఏకాభిప్రాయానికి వచ్చి పెళ్లితంతు జరిపిస్తారు. అయితే ఇప్పడు మనం తెలుసుకోబోయే విషయం చాలా విచిత్రమైనది. పూర్వం ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎవరిని నిశ్చయిస్తే అతడినే వివాహం చేసుకునేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. అందుకు నిదర్శనమే ఈ వీడియో… ఈ వీడియోలో వివాహం వేదికపై వరుడు వధువు మెడలో వరమాల వేశాడు. అనంతరం వధువు వరుడి మెడలో మాల వేయాలి. కానీ అందుకు వధువు నిరాకరించింది. అతడు నిరక్షరాస్యుడని, చదువుకోలేదు కాబట్టి తాను వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తేల్చి చెప్పింది. బీఈడీ చదువుకున్న సదరు యువతి తనకు సమానమైన చదువు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయం విని అక్కడున్నవారంతాఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.అయితే.. ఆ విషయాన్ని పెళ్లి నిశ్చయించటానికి ముందుగానే ఈ విషయం చెప్పొచ్చుకదా.. అలా ఎందుకు చేయలేదని అక్కడి గుంపులోని ఒక వ్యక్తి వధువును ప్రశ్నించాడు. అందుకు ఆమె తాను ఈ వివాహాన్ని ముందునుంచీ వ్యతిరేకిస్తున్నానని, తన తండ్రి మాత్రం తన మాటను వినకుండా ఒత్తిడి తెచ్చినట్లు తెలిపింది. పెళ్లి పీటల మీద చివరి క్షణంలో వివాహాన్ని రద్దు చేసుకోవటం, వరుడికి ఇబ్బంది కలిగించటం విషయాన్ని పక్కన పెడితే.. సదరు యువతి ధైర్యంగా నిర్ణయం తీసుకోవటంపై వధువును ప్రశంశించారు. వీడియో చూస్తున్న వేలమంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “బ్రేవో.. మంచి.. ధైర్యవంతురాలైన స్త్రీ .. ఐ సెల్యూట్.. అని ఒకరంటే.. చదువుకున్న ఈ అమ్మాయి తనకోసం తాను మాట్లాడటం అభినందనీయం, పెళ్లి చేసుకోకూడదనే తన నిర్ణయంపై మొండిగా మాట్లాడటం అభినందనీయం. ఇది భారతదేశ పురోగతిని చూపుతుంది” అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇలా అనేక మంది సదరు యువతి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ.. వ్యక్తిగత నిర్ణయాలకు విలువ ఇవ్వాలని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

