Brazilian Singer Dani Li: ఆపరేషన్‌ వికటించి ప్రముఖ సింగర్‌ కన్నుమూత.! వీడియో.

Brazilian Singer Dani Li: ఆపరేషన్‌ వికటించి ప్రముఖ సింగర్‌ కన్నుమూత.! వీడియో.

Anil kumar poka

|

Updated on: Jan 30, 2024 | 2:55 PM

లైపోసక్షన్‌ ఆపరేషన్‌ వికటించడంతో ప్రముఖ సింగర్‌ కన్నుమూసారు. బ్రెజిలియన్‌ పాప్‌ స్టార్‌ డానీ లీ ఇటీవల లైపోసక్షన్‌ ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఆపరేషన్‌ వికటించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మెట్రో కథనం రిపోర్ట్‌ ప్రకారం బ్రెజిల్‌లో గాయనిగా పాపులర్‌ అయిన లీ బాడీలోని కొన్ని భాగాల్లో కొవ్వును తొలగించుకునేందకు ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఆపరేషన్‌ తరువాత సమస్యలు తలెత్తడంతో కన్నుమూసారు.

లైపోసక్షన్‌ ఆపరేషన్‌ వికటించడంతో ప్రముఖ సింగర్‌ కన్నుమూసారు. బ్రెజిలియన్‌ పాప్‌ స్టార్‌ డానీ లీ ఇటీవల లైపోసక్షన్‌ ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఆపరేషన్‌ వికటించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మెట్రో కథనం రిపోర్ట్‌ ప్రకారం బ్రెజిల్‌లో గాయనిగా పాపులర్‌ అయిన లీ బాడీలోని కొన్ని భాగాల్లో కొవ్వును తొలగించుకునేందకు ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఆపరేషన్‌ తరువాత సమస్యలు తలెత్తడంతో కన్నుమూసారు. ఇది ఊహించని పరిణామమంటూ ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అటు తమ అభిమాన స్టార్‌ సింగర్‌ ఆకస్మిక మరణంపై ఫ్యాన్స్‌ కూడా దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. డానీ.. బొడ్డు, వీపుపై లైపోసక్షన్‌తో పాటు రొమ్ములను తగ్గించుకునేందు కూడా ఆపరేషన్‌ చేయించుకున్నారు. పరిస్థితి విషమించడంతో సమీపంలోని కురిటిబాలోని ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది.

లీకి భర్త, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. గాయని మృతిపై విచారణ జరుగుతోందని మెట్రో నివేదించింది. డానీ లీఅమెజాన్‌లోని అఫువా అనే ద్వీపంలో జన్మించారు. సింగర్‌ అవ్వాలనే కోరికతో అయిదేళ్ల వయసునుంచే పాడటం ప్రారంభించిన ఆమె టాలెంట్ షోలతో పేరు తెచ్చుకున్నారు. 2014లో విడుదలైన ఐ యామ్ ఫ్రమ్ ది అమెజాన్ అనే పాటతో గాయనిగా పాపులర్‌ అయ్యారు. ఆమె చివరి పాట ‘గుయెర్రా డి అమోర్’ జనవరి 14న విడుదలైంది. డానీ లీ.. అసలు పేరు, డానియెల్ ఫోన్సెకా మచాడో.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Published on: Jan 30, 2024 02:55 PM