తల్లిపై ఫిర్యాదు చేసేందుకు 130 కి.మీ. సైకిల్‌ తొక్కిన బాలుడు !!

|

Apr 17, 2023 | 8:49 PM

చిన్న పిల్లలు అమ్మనాన్నలపై అలిగినప్పుడు ఇంట్లో ఉండే నానమ్మ, అమ్మమ్మ లేదా తాతయ్యల దగ్గరికి వెళ్ళడం మాములే. కాని చైనాలో ఓ బాలుడు తన తల్లితో గొడవపడి ఆమెపై అమ్మమ్మకు ఫిర్యాదు చేయడానికి ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లాడు.

చిన్న పిల్లలు అమ్మనాన్నలపై అలిగినప్పుడు ఇంట్లో ఉండే నానమ్మ, అమ్మమ్మ లేదా తాతయ్యల దగ్గరికి వెళ్ళడం మాములే. కాని చైనాలో ఓ బాలుడు తన తల్లితో గొడవపడి ఆమెపై అమ్మమ్మకు ఫిర్యాదు చేయడానికి ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లాడు. బీజింగ్‌లో ఉంటున్న 11 ఏళ్ల బాలుడు అమ్మతో గొడవపడ్డాడు. ఏదో విషయంలో ఆ తల్లి తన కొడుకుని తిట్టింది. దాంతో అలిగిన ఆ చిన్నారి నీపని అమ్మమ్మకు చెప్తానని తల్లితో అన్నాడు. ఆ తల్లి నవ్వి ఊరుకుంది. కానీ, ఆ బాలుడు జరిగిన విషయాన్నంతా అమ్మమ్మకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే వాళ్ల అమ్మమ్మ ఇంటికీ చేరుకోవాలంటే దాదాపు గంట సమయం పడుతుంది. వెంటనే బాలుడు సైకిల్‌పై అమ్మమ్మ ఇంటికి బయలుదేరాడు. రోడ్డుపై కనిపించే బోర్టులు చూసుకుంటూ వెళ్తున్నాడు. కాస్త దూరం వెళ్లాక తను వెళ్లాల్సిన దారి మరిచిపోయాడు. అలా సైకిలు తొక్కుతూ తొక్కుతూ దాదాపు 130 కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ టన్నెల్ వద్ద స్పృహ తప్పి పడిపోయాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నది లోపల మెట్రో రైలు పరుగు.. ఎక్కడో తెలుసా ??

క్యాష్ డిపాజిట్ మెషిన్‌లో డబ్బులు వేశాడు.. బ్యాంక్‌కే షాకిచ్చే ప్రయత్నం

క్రేజీ డ్యాన్స్‌తో హోరెత్తించిన పోలీస్‌ అధికారి !! నెట్టింట వైరల్

మహిళ గొంతులో ఇరుక్కున్న చేప.. అతి కష్టంమీద..

వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. స్విగ్గీ నిర్వాకం

 

Published on: Apr 17, 2023 08:49 PM