నది లోపల మెట్రో రైలు పరుగు.. ఎక్కడో తెలుసా ??

నది లోపల మెట్రో రైలు పరుగు.. ఎక్కడో తెలుసా ??

Phani CH

|

Updated on: Apr 17, 2023 | 8:47 PM

దేశంలోనే తొలిసారిగా 1984లో కోల్‌కతా మెట్రో రైలు ప్రారంభమయ్యింది. మళ్లీ 39 ఏళ్ల తర్వాత కొత్త చరిత్రను తిరగరాస్తూ.. నది లోపలి నుంచి మెట్రో రైలు నడిచింది. హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో కోల్‌కతాలోని మహాకరణ్‌ స్టేషన్‌ నుంచి హౌరా మైదాన్‌ స్టేషన్‌ వరకు రైలు పరుగులు తీసింది.

దేశంలోనే తొలిసారిగా 1984లో కోల్‌కతా మెట్రో రైలు ప్రారంభమయ్యింది. మళ్లీ 39 ఏళ్ల తర్వాత కొత్త చరిత్రను తిరగరాస్తూ.. నది లోపలి నుంచి మెట్రో రైలు నడిచింది. హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో కోల్‌కతాలోని మహాకరణ్‌ స్టేషన్‌ నుంచి హౌరా మైదాన్‌ స్టేషన్‌ వరకు రైలు పరుగులు తీసింది. బుధవారం జరిగిన ట్రయల్‌ రన్‌లో కోల్‌కతా మెట్రో రైల్వే జనరల్‌ మేనేజర్‌ పి.ఉదయ్‌కుమార్‌ రెడ్డితో పాటు మరికొందరు సీనియర్ అధికార్లు, ఇంజినీర్లు ప్రయాణం చేశారు. కోల్‌కతా నగర ప్రజలకు ఆధునిక రవాణా వ్యవస్థను అందించే ప్రయత్నంలో ఇది విప్లవాత్మక ముందడుగు అని అధికారులు పేర్కొన్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంపై అధికారులు, ఇంజినీర్లకు మెట్రో జీఎం ఉదయ్‌కుమార్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యాష్ డిపాజిట్ మెషిన్‌లో డబ్బులు వేశాడు.. బ్యాంక్‌కే షాకిచ్చే ప్రయత్నం

క్రేజీ డ్యాన్స్‌తో హోరెత్తించిన పోలీస్‌ అధికారి !! నెట్టింట వైరల్

మహిళ గొంతులో ఇరుక్కున్న చేప.. అతి కష్టంమీద..

వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. స్విగ్గీ నిర్వాకం

Araku Valley: వేసవిలోనూ మంత్రముగ్ధులను చేస్తున్న అరకు అందాలు

 

 

Published on: Apr 17, 2023 08:47 PM