విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. పొగతో నిండిపోయిన క్యాబిన్.. చివరకు..
గాలిలో ఎగురుతున్న ఓ విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పక్షి ఢీకొట్టగానే విమానంలోని కేబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో మరింత కంగారు పడ్డారు ప్రయాణికులు. విమానం బయలుదేరిన 20 నిమిషాలకే వెనక్కి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
అందులో ఒక ప్రయాణికుడు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని భయపడడం కనిపిస్తుంది. ఆగస్టు 3న జరిగిన ఈ ఘటనలో పారిస్ వెళ్తున్న ఓ విమానం ముక్కు భాగాన్ని పక్షి ఢీకొనడంతో క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. ఐబేరియా విమానం ఐబీ-579 మాడ్రిడ్‌లోని అడోల్ఫో సువారెజ్ మాడ్రిడ్-బారాజాస్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన 20 నిమిషాలకే ఒక పెద్ద పక్షి విమానం ముక్కు భాగాన్ని బలంగా ఢీకొంది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానంలో ఉన్న ప్రయాణికుడు జియాన్‌కార్లో సాండోవల్ ఈ భయానక దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొదట అది సాధారణ గాలి దుమారం అనుకున్నామని, కానీ తర్వాత భయానక శబ్దాలు వినిపించడంతో ఏదో జరిగిందని అర్థమైందని ఆయన పేర్కొన్నారు. వీడియోలో విమానం కుదుపులకు లోనవడం, వింత శబ్దాలు రావడం, క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోవడం కనిపించింది. ప్రయాణికులు భయంతో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. అయితే, విమానం సురక్షితంగా మాడ్రిడ్‌లో ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం ఒక పక్షి.. విమానాన్ని ఇంతగా దెబ్బతీయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు నెటిజన్లు. ‘విమానాలు ఒకప్పుడు స్కైస్క్రాపర్లను కూడా కూల్చేవని, ఇప్పుడు ఒక పక్షిని కూడా తట్టుకోలేకపోతున్నాయంటూ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Liver: రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ షెడ్డుకే
Jr NTR: వార్ 2 ను అందుకే అంగీకరించాను
Weather Alert: వెదర్ వార్నింగ్.. మూడు రోజులు భారీ వర్షాలు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

