విజయవాడలో రెచ్చిపోతున్న బైక్ రేసర్లు.. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై స్టంట్లు చేస్తూ హల్‌చల్.. వీడియో
విజయవాడలో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై బైక్ లతో స్టంట్లు చేస్తూ వాహనదారులకు దడ పుట్టిస్తున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై కొందరు యువకులు దూసుకుపోతూ బైక్ పై నిలబడి పిస్టల్‌తో విన్యాసాలు చేశారు.
విజయవాడలో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై బైక్ లతో స్టంట్లు చేస్తూ వాహనదారులకు దడ పుట్టిస్తున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై కొందరు యువకులు దూసుకుపోతూ బైక్ పై నిలబడి పిస్టల్‌తో విన్యాసాలు చేశారు. హ్యాండిల్స్ వదిలేస్తూ బైక్ పై నిలబడుతూ భయాందోళనకు గురి చేశారు. అంతటితో ఆగలేదు బైక్‌పై వేగంగా వెళ్తూ కూర్చుంటూ.. నిలబడుతూ స్టంట్స్ చేశారు. అలాగే వేగంగా వెళ్తున్న బైక్‌పై నిలుచుని తుపాకీతో హల్‌చల్ చేశారు. అయితే ఎవరికి దొరకకుండా ఉండేందుకు బైక్‌లపై నంబర్ ప్లేట్లను తొలగించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. రేసులతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అసలు ఆ యువకులకు తుపాకులు ఎలా వచ్చాయి…? అవి డమ్మీవా లేక నిజమైన తుపాకీలా..? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Pawan Kalyan Shramadanam: పవన్ కళ్యాణ్ శ్రమదానం లైవ్ వీడియో
Viral Video: ప్రపంచంలో అత్యంత ఎత్తు నుంచి తీసిన వీడియో.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

