రైడ్ క్యాన్సిల్ చేసినందుకు యువతిపై చేయి చేసుకున్న ఓలా ఆటో డ్రైవర్
బెంగళూరులో ఓలా ఆటో డ్రైవర్ ఒక యువతిపై అనుచితంగా ప్రవర్తించి, దాడిచే సిన ఘటన కలకలం రేపింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. బాధిత యువతి ఎక్స్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం తన స్నేహితురాలితో కలిసి బెంగళూరు సిటీలో ఓలా ఆటో రైడ్‌ను బుక్ చేసారు. తొందరగా వెళ్లాలనే ఉద్దేశంలో ఇద్దరూ ఓలా రైడ్ కోసం ప్రయత్నించగా ఇద్దరివీ బుక్ అయ్యాయి.
బెంగళూరులో ఓలా ఆటో డ్రైవర్ ఒక యువతిపై అనుచితంగా ప్రవర్తించి, దాడిచే సిన ఘటన కలకలం రేపింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. బాధిత యువతి ఎక్స్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం తన స్నేహితురాలితో కలిసి బెంగళూరు సిటీలో ఓలా ఆటో రైడ్‌ను బుక్ చేసారు. తొందరగా వెళ్లాలనే ఉద్దేశంలో ఇద్దరూ ఓలా రైడ్ కోసం ప్రయత్నించగా ఇద్దరివీ బుక్ అయ్యాయి. ఇదే వివాదానికి దారి తీసింది. ముందుగా వచ్చిన ఆటోలో యువతులిద్దరూ ఎక్కి కూర్చున్నారు. ఇంతలో 15 నిమిషాలు ఆలస్యం చూపించిన రెండో ఆటోను రద్దు చేసింది. కానీ అక్కడికి చేరుకున్న రెండో ఆటోవాలా తన రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ వాదనకు దిగాడు. అంతేకాదు పెట్రోల్ ఊరికే వస్తుందా, అంటూ రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగాడు. దీంతో నన్ను చెంపపై ఎందుకు కొట్టావ్ అంటూ ఆమె గట్టిగా నిలదీసింది. అప్పటిదాకా చోద్యం చూస్తూ కూర్చున్న మిగిలిన డ్రైవర్లు, జోక్యం చేసుకుని అతడిని పక్కకు తీసుకెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ పార్క్ చేశారంటే.. మీ బైక్ సీదా అస్సాంకే
వాయుకాలుష్యం.. పురుషులపై ఎఫెక్ట్ !! 5 లక్షల మందిపై అధ్యయనం
బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి హీనా ఖాన్‌కు మరో షాక్
అవును.. రాజ్‌తరుణ్ నిందితుడే పోలీసుల చార్జిషీట్
కోల్‌కత ట్రైనీ డాక్టర్ పై జరిగింది గ్యాంగ్ రే***ప్ కాదా ??