Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫీసు టేబుల్ మీదే ఆమె ల్యాప్‌టాప్.. ఆమె మాత్రం అనంతలోకాలకు వీడియో

ఆఫీసు టేబుల్ మీదే ఆమె ల్యాప్‌టాప్.. ఆమె మాత్రం అనంతలోకాలకు వీడియో

Samatha J
|

Updated on: Jun 13, 2025 | 11:03 AM

Share

విరాట్ కోహ్లీ మీద ఉన్న విపరీతమైన అభిమానమే ఆమె ప్రాణాలు తీసింది. దేవి చనిపోయిందన్న వార్త విన్న తోటి ఉద్యోగులు అంతా షాక్ అయ్యారు. అప్పటివరకు తమతోనే ఉన్న ఆమె ఇలా కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ ఆమె టేబుల్ పైన ల్యాప్‌టాప్, బ్యాగు ఉండగా అది చూసిన సిబ్బంది అంతా కన్నీరు మున్నీరవుతున్నారు. అలాగే ఆమె తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎలా చెప్పి తగ్గించాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

క్రికెట్ జట్టు మొత్తం చిన్నస్వామి స్టేడియానికి వస్తున్నట్లు తెలుసుకొని టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంది. కానీ ఆన్‌లైన్‌లో అప్పటికే టికెట్లు అన్ని అమ్ముడుపోయాయి. దీంతో ఏం చేయాలో పోలీపోని ఆమె ఆఫీస్‌కు వెళ్లింది. కానీ అక్కడికి వెళ్ళాకే ఆమెకు తెలిసింది బయట టికెట్లు అమ్ముతున్నారని అది నిజమా కాదో తెలియక ముందే దేవి అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఒక్క టికెట్ కాబట్టి సులువుగా దొరుకుతుందని భావించింది. ఇందుకోసం తన పై అధికారికి సెలవు కూడా అడిగింది. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అయినప్పటికీ పట్టు వదలని దేవి విపరీతంగా బతిమాలి మరి సెలవు తీసుకుంది. కాసేపట్లోనే వచ్చేస్తానంటూ టేబుల్ మీద ల్యాప్‌టాప్ తన బ్యాగు ఉంచి బయలుదేరింది. అయితే మెట్రో ద్వారా స్టేడియానికి వెళుతున్నానని తోటి సహోద్యోగికి మెసేజ్ పెట్టింది. అయితే ఇదే ఆమె చివరి మెసేజ్. స్టేడియం వద్దకు వెళ్ళాక దేవి టికెట్ల కోసం ప్రయత్నాలు చేసింది. అప్పటికే అనేకమంది అక్కడ గుంమి గూడగా ఉత్సాహంగా గేటు వద్దకు వెళ్లి లోపలికి వెళ్ళాలని చూసింది. ఒక్కసారిగా అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే దేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆపే పోలీసులు ఈమె మృతిదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వీడియోల కోసం :

వావ్‌.. అట్లుంటది ఏఐ రోబోతోని.. వీడియో

టాయిలెట్‌లో వింత జంతువును చూసి షాక్‌ వీడియో

ఏనుగు ‘షాపింగ్‌’ బిల్లు’ను చెల్లించిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వీడియో

ఐడియా అదిరింది.. నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్‌ వీడియో