Bear selfie Video: సెల్ఫీ వీడియో తీసుకున్న ఎలుగుబంటి..! నాలుగున్నర మిలియన్‌ వ్యూస్‌తో వైరల్‌..

|

Oct 12, 2021 | 1:52 PM

అమెరికాలో వ్యోమింగ్‌ హిల్స్‌ మంచుతో నిండిన పర్వతప్రాంతం. జనసంచారం లేని ఈ ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువ. ఇక్కడ నాలుగు నెలల క్రితం ఓ వ్యక్తి తన గో ప్రో కెమెరా పోగొట్టుకున్నాడు.

అమెరికాలో వ్యోమింగ్‌ హిల్స్‌ మంచుతో నిండిన పర్వతప్రాంతం. జనసంచారం లేని ఈ ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువ. ఇక్కడ నాలుగు నెలల క్రితం ఓ వ్యక్తి తన గో ప్రో కెమెరా పోగొట్టుకున్నాడు. దాని కోసం అన్వేషిస్తూ వెళ్ళిన అతనికి కొంతకాలం తర్వాత దొరికింది కెమెరా. ఇంటికి తెచ్చి చార్జింగ్‌ పెట్టి చూడగా ఎలుగుబంటి సెల్ఫీ వీడియో చూసి కంగుతిన్నాడు. ఫన్నీ విజువల్స్‌ని నెట్‌లో అప్‌లోడ్‌ చేయగా వైరల్‌గా మారాయి.

అటుగా వెళుతున్న ఎలుగుబంటికి వ్యోమింగ్‌ హిల్స్‌లో గో ప్రో కెమెరా కనిపించింది. ఇంకేముంది? కెమెరాను ఆహారంగా భావించి తినే ప్రయత్నం చేసింది. మంచులో కూరుకుపోయిన కెమెరాను బయటకు తీయడానికి నోటితో చేతి గోళ్ళతో చాలా సేపు ప్రయత్నించింది. మధ్యలో అలసిపోయి కాసేపు కూర్చుండిపోయింది. రెస్ట్‌ తర్వాత మళ్ళీ ప్రయత్నం కొనసాగించింది. ఈ క్రమంలో కెమెరా ఆన్‌ అయి విజువల్స్‌ రికార్డ్‌ అయ్యాయి. ఎంతోసేపటికి గానీ అది తినే వస్తువు కాదని దానికి అర్థం కాలేదు. ఆ తర్వాత కెమెరాను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది.

గో ప్రో కెమెరాను ఆన్‌ చేసి, సెల్ఫీ వీడియో రికార్డ్‌ చేసిన బ్లాక్‌ బేర్‌ ఫన్నీ విజువల్స్‌ను సదరు వ్యక్తి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. దాంతో వీడియో వైరల్‌గా మారి నాలుగున్నర మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Afghan tourists: బోటింగ్‌తో సేదదీరుతున్న అఫ్గానీలు.. పెరుగుతోన్న టూరిస్ట్‌ల తాకిడి.. మరి తాలిబన్లు అనుమతి..?

 Ajay Bhupati on MAA Elections: ఆ ప్యానల్‌కు ఓటేస్తేనే సినిమాల్లో ఛాన్స్‌ ఇస్తా అన్నాడు..! వైరల్‌గా అజయ్‌ భూపతి ట్వీట్‌.. (వీడియో)

 pakistan earthquake: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి కూలిన ఇళ్ళు.. వందలాది మందికి గాయాలు..(వీడియో)

 Pamban Bridge: కొత్త పంబన్‌ బ్రిడ్జి.. తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జి.. ఆకట్టుకుంటున్న వీడియో..

Follow us on