Bear Viral Video: అల్లూరి జిల్లాలో వాటర్ డ్యాంపై ఎలుగుబంటి హల్చల్.. వీడియో.
ఎలుగుబంట్లు అడవిని వీడి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం దొరక్కో.. మరే ఇతర కారణాల చేతనో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా అల్లూరి జిల్లా ముంచంగి పుట్టులో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. మాచ్ ఖండ్ జలాశయం సమీపంలోని డుడుమ డ్యాం వద్దకు వచ్చేసింది. అటు ఇటు తిరుగుతూ ఎలుగుబంటి హల్చల్ చేసింది. డ్యాం ఆపరేటర్ గదికి సమీపంలో ఎలుగుబంటి కనిపించడంతో.. గుండె ఆగినంత పని అయింది అక్కడ స్థానికులకు. భయంతో బికుబిక్కుమన్నరు సిబ్బంది.
ఎలుగుబంట్లు అడవిని వీడి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం దొరక్కో.. మరే ఇతర కారణాల చేతనో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా అల్లూరి జిల్లా ముంచంగి పుట్టులో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. మాచ్ ఖండ్ జలాశయం సమీపంలోని డుడుమ డ్యాం వద్దకు వచ్చేసింది. అటు ఇటు తిరుగుతూ ఎలుగుబంటి హల్చల్ చేసింది. డ్యాం ఆపరేటర్ గదికి సమీపంలో ఎలుగుబంటి కనిపించడంతో.. గుండె ఆగినంత పని అయింది అక్కడ స్థానికులకు. భయంతో బికుబిక్కుమన్నరు సిబ్బంది. ఎంతకీ అక్కడ నుంచి వెళ్లక.. అరుస్తుండడంతో అక్కడ సిబ్బంది ఆందోళనలో పడ్డారు. చీకటి కావడంతో.. దాడి చేస్తుందేమోనని భయపడ్డారు. అక్కడే తిష్ట వేసి కూర్చోవడంతో కంగారెత్తి పోయారు. నేరుగా వెళ్లి తరిమే అవకాశం లేక.. ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. ఓ వాహనంలో కూర్చుని.. చీకట్లో ఉన్న వెలుగుబంటి పై లైట్లు వేశారు. అది చూసి భయపడిన ఆ ఎలుగుబంటి.. మెల్లగా అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చేసింది. అదే అదనంగా చేసుకొని వాహనం సహాయంతో దాన్ని వెంబడించారు. సమీప అడవుల్లోకి తరిమెసేరు. ఎలుగుబంటి అడవుల్లోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.