Hyderabad Biryani: హైదరాబాద్‌ బిర్యానీకి ఎందుకింత క్రేజ్.? బిర్యానీ టేస్ట్ వెనుక ఫార్ములా ఇదే.!

బిర్యానీ.. ఈ పేరు వినగానే ఎవరికైనా నోరూరిపోవాల్సిందే..! హైదరాబాద్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది చారిత్రక కట్టడం ఛార్మినార్‌, ముత్యాల హారాలతో పాటు గరం గరం దమ్‌కీ బిర్యానీ. మన హైదరాబాద్ బిర్యానీ.. ప్రపంచ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుతోంది. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

Hyderabad Biryani: హైదరాబాద్‌ బిర్యానీకి ఎందుకింత క్రేజ్.? బిర్యానీ టేస్ట్ వెనుక ఫార్ములా ఇదే.!

|

Updated on: Jun 13, 2024 | 7:45 PM

బిర్యానీ.. ఈ పేరు వినగానే ఎవరికైనా నోరూరిపోవాల్సిందే..! హైదరాబాద్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది చారిత్రక కట్టడం ఛార్మినార్‌, ముత్యాల హారాలతో పాటు గరం గరం దమ్‌కీ బిర్యానీ. మన హైదరాబాద్ బిర్యానీ.. ప్రపంచ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుతోంది. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. హైదరాబాద్‌లోనే కాదు.. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ హైదరాబాద్ బిర్యానీ లేదా హైదరాబాద్ దమ్ బిర్యానీ పేరుతో చాలా హోటళ్లు ఉన్నాయి. ఆ హోటళ్ల ముందు నిత్యం బిర్యానీ ప్రియులు క్యూ కడతారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నా.. వాటిలో హైదరాబాద్ బిర్యానీకున్న బ్రాండ్ ఇమేజ్ చాలా చాలా స్పెషల్. హైదరాబాద్ నుంచి విదేశాలకు కూడా నిత్యం టన్నుల కొద్దీ బిర్యానీ ఎక్స్ పోర్ట్ అవుతుంది. దీనిని బట్టి బిర్యానీకున్న క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బిర్యానీ చుట్టూ రోజూ కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది. అందుకే ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే కేవలం ఓ మామూలు డిష్ మాత్రమే కాదు.. కోట్లు కురిపించే రుచికరమైన వంటకం.

అసలీ హైదరాబాద్ బిర్యాని అంత టేస్ట్ గా ఉండడానికి కారణమేంటి? బిర్యానీ తయారీలో ఉపయోగించే ముడి సరకులే దాన్ని ఎంతో రుచికరంగా మార్చేస్తాయి. కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఆరోగ్యానికి దోహదపడే చాలా అంశాలు హైదరాబాద్ బిర్యానీలో ఉన్నాయి. హైదరాబాద్‌ బిర్యానీ చరిత్ర చూస్తే.. పర్షియన్‌ భాషలో బిరియన్‌ అంటే వేయించిన లేదా కాల్చిన అనే అర్థం. 1518 – 1687 మధ్య కాలంలో హైదరాబాద్‌ను పాలించిన కుతుబ్‌ షాహీల ద్వారా.. ఈ బిర్యానీ.. పర్షియ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. తరువాత 1930-50లలో పర్షియ నుంచి భారీగా వలసలు పెరగడం కూడా హైదరాబాద్‌లో బిర్యానీ సంస్కృతి పెరగడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. సాధారణంగా బిర్యానీని ఒక పెద్ద పాత్రలో వండుతారు. కింద వెడల్పుగా ఉండి, పైన చిన్నగా ఉండే పాత్ర ఇది. ఇందులో ఒకేసారి 40 కేజీల వరకు వండేందుకు వీలున్న పెద్ద పాత్రను ఉపయోగిస్తారు. పాత్రలో ఏర్పడే ఆవిరి ద్వారా బియ్యంతో పాటు, మాంసం ఉడుకుతుంది. పాత్రపై బోర్లించిన మూతపై మండుతున్న బొగ్గును పోస్తారు. దీని ద్వారా అన్నివైపులా సమానంగా వేడి అందుతుంది. బియ్యం, మాంసం, సుగంధ ద్రవ్యాల మేలు కలయిక.. బిర్యానీ రుచిని అమాంతం పెంచుతుంది. అన్నిటికీ మించి బిర్యానీ చేసే వారి పనితనం, సృజనాత్మకత దీని రుచిని రెట్టింపు చేస్తుంది. చెఫ్ లు ప్రత్యేక శైలిలో బిర్యానీని తయారు చేస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
మీ రైలు మిస్‌ అయితే మరో ట్రైన్‌లో ప్రయాణించవచ్చా? నిబంధనలేంటి?
మీ రైలు మిస్‌ అయితే మరో ట్రైన్‌లో ప్రయాణించవచ్చా? నిబంధనలేంటి?
హైదరాబాద్‌లో రాష్ట్రపతికి ఘనస్వాగతం
హైదరాబాద్‌లో రాష్ట్రపతికి ఘనస్వాగతం
భారత్‌లో దుమ్మురేపుతున్న బడ్జెట్ కార్లు.. ది బెస్ట్ ఇవే..!
భారత్‌లో దుమ్మురేపుతున్న బడ్జెట్ కార్లు.. ది బెస్ట్ ఇవే..!
రామ, రావణుడితో పూజను అందుకున్న శక్తిపీఠం ఎక్కడుందో తెలుసా..
రామ, రావణుడితో పూజను అందుకున్న శక్తిపీఠం ఎక్కడుందో తెలుసా..
దివిలో చంద్రునికే సెగలు పుట్టిస్తున్న ప్రగ్యా సిజ్లింగ్ లుక్స్..
దివిలో చంద్రునికే సెగలు పుట్టిస్తున్న ప్రగ్యా సిజ్లింగ్ లుక్స్..
మెరుపులు కురిపిస్తున్న దేవర.. మిగిలిన సినిమాల గురించి డిస్కషన్‌.!
మెరుపులు కురిపిస్తున్న దేవర.. మిగిలిన సినిమాల గురించి డిస్కషన్‌.!
గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?
గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?
హెల్మెట్‌తో ఎల్‌బీడబ్ల్యూ చేయోచ్చు: రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్
హెల్మెట్‌తో ఎల్‌బీడబ్ల్యూ చేయోచ్చు: రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్
ఐపీఓకు ముందుకు వచ్చిన స్విగ్గీ.. రూ.3750 కోట్ల సేకరణే టార్గెట్..!
ఐపీఓకు ముందుకు వచ్చిన స్విగ్గీ.. రూ.3750 కోట్ల సేకరణే టార్గెట్..!
అక్టోబర్‌ 1 నుంచి ఐదు పెద్ద మార్పులు.. మీ జేబుపై ప్రభావం పడనుందా?
అక్టోబర్‌ 1 నుంచి ఐదు పెద్ద మార్పులు.. మీ జేబుపై ప్రభావం పడనుందా?