Viral Video: ఎలుగుబంటి వేసిన పెయింటింగ్‌ చూసి.. నెటిజ‌న్లు ఫిదా

Viral Video: ఎలుగుబంటి వేసిన పెయింటింగ్‌ చూసి.. నెటిజ‌న్లు ఫిదా

Phani CH

|

Updated on: Jul 08, 2022 | 9:41 AM

సృజ‌నాత్మ‌క‌త అనేది మ‌నుషుల‌కే సొంతం అనుకుంటాం. కానీ, కొన్ని జంతువులు కూడా క్రియేటివిటీని ప్ర‌ద‌ర్శిస్తాయి. ఓ ఎలుగుబంటి త‌న క్రియేటివిటీని చూపే వీడియో ఒక‌టి సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది.

సృజ‌నాత్మ‌క‌త అనేది మ‌నుషుల‌కే సొంతం అనుకుంటాం. కానీ, కొన్ని జంతువులు కూడా క్రియేటివిటీని ప్ర‌ద‌ర్శిస్తాయి. ఓ ఎలుగుబంటి త‌న క్రియేటివిటీని చూపే వీడియో ఒక‌టి సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. అది వేసిన క‌ల‌ర్‌ఫుల్ పెయింటింగ్‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ‘నార్త్‌వెస్ట్ ట్రెక్ వైల్డ్‌లైఫ్ పార్క్‌’ త‌న ఇన్‌స్టా పేజీలో షేర్ చేసింది. యూఎస్‌లోని నార్త్‌వెస్ట్ ట్రెక్ వైల్డ్‌లైఫ్ పార్క్‌ 723 ఎక‌రాల్లో విస్త‌రించి ఉంది. ఇందులోని ‘ఫెర్న్’ అనే ఎలుగుబంటి పాద ముద్ర‌లు తీసుకునేందుకు పార్కు సిబ్బంది దానిముందు కొన్ని ర‌కాల రంగుల‌ను ఉంచారు. అయితే, అది చిత్రంగా ఆ రంగుల‌లో పాదాల‌తో పాటు ముఖాన్ని ముంచి ఆనందంగా ఆడుకుంది. నేల‌పై అంద‌మైన పెయింటింగ్ వేసింది. ఇది చూసి పార్కు సిబ్బంది ఆశ్చ‌ర్య‌పోయారు. దీన్ని వీడియో తీసి ఇన్‌స్టాలో ఉంచారు. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది. ఆ పెయింటింగ్‌ను కాన్వాస్‌పై ఉంచి విక్ర‌యించొచ్చ‌ని, చాలా డ‌బ్బులు వ‌స్తాయ‌ని నెటిజ‌న్లు కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరో వివాదాస్పద ఫోటోతో.. హిందూ సంఘాలకు కాలేలా చేసిన లీనా..

Pooja Hegde: తమిళ్ స్టార్ హీరోలను మడతెట్టేసిన బుట్టబొమ్మ

Shruti Haasan: ‘తనే నా బెస్ట్’ డార్లింగ్‌ అంటే ఎంత ఇష్టమో చెప్పిన శ్రుతి..

ఇలాంటి బెల్లీ డ్యాన్స్ సినిమాల్లో చేసుంటేనా.. ఈ పాటికి స్టార్ హీరోయిన్ అయిపోయేదిగా !!

ఆషాడంలో మునగాకు తినాలంటారు.. ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా ??

 

Published on: Jul 08, 2022 09:41 AM