Amarnath Yatraఅమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్.. తిరిగే అప్పుడే భక్తులకు అనుమతి !!
అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు జమ్మూకాశ్మీర్‌కు చేరుకుంటున్నారు. ప్రతిరోజూ వేలాది మంది పవిత్ర గుహను సందర్శిస్తున్నారు.
అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు జమ్మూకాశ్మీర్‌కు చేరుకుంటున్నారు. ప్రతిరోజూ వేలాది మంది పవిత్ర గుహను సందర్శిస్తున్నారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో భక్తులు అమర్‌నాథ్ గుహను సందర్శించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, సీఆర్పీఎఫ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, రెండేళ్ల విరామం తర్వాత మొదలైన అమర్‌నాథ్ యాత్రను మంగళవారం తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్రను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణం అనుకూలించిన వెంటనే మళ్లీ ప్రారంభించనున్నారు. మంగళవారం ఉదయం పహల్గామ్ యాక్సిస్‌లోని నున్వాన్ బేస్ క్యాంపు వద్ద సుమారు 3,000 మంది యాత్రికులను దర్శనానికి అనుమతించలేదని అధికారులు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అధికారులకు కవలల బురిడీ.. ఒకరి పాస్‌పోర్ట్‌తో ఒకరు 30 సార్లు విదేశాలకు