నాటుకోడి మాంసం పంపిస్తే.. లోన్‌ శాంక్షన్‌ చేస్తా !!

|

Dec 15, 2024 | 11:41 AM

బ్యాంకులో లోను కోసం అప్లై చేసుకునేవారు బ్యాంకు మేనేజర్లను ప్రసన్నం చేసుకోవాల్సిందేనా అనిపిస్తోంది ఈ ఘటన చూస్తే. వారు కోరింది ఇవ్వక పోతే లోను అప్రూవ్‌ చేయరేమోనని కొందరు తమ శక్తికి మించి మేనేజర్లకు ముడుపులు చెల్లించుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు కొందరు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసింది.

ఫౌల్ట్రీఫారాన్ని డెవలప్ చేసుకుందామని ఓ రైతు బ్యాంకులో లోను కోసం వెళ్తే నాటు కోడి మాంసం పంపిస్తే లోను ఇస్తానని చెప్పాడు ఆ మేనేజర్‌. ఛత్తీస్‌గఢ్‌లోని మస్తూరికి చెందిన రూప్‌చంద్ మన్హర్ అనే రైతు త‌న పౌల్ట్రీ వ్యాపారాన్ని విస్తరించేందుకు రూ. 12ల‌క్షల రుణం కోసం మ‌స్తూరి ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజ‌ర్‌ను క‌లిశాడు. ఆయ‌న 10 శాతం క‌మీష‌న్ తీసుకోవ‌డంతో పాటు ప్రతి శ‌నివారం దేశీ చికెన్ పంపాల్సిందిగా ఆదేశించాడు. అలా ఇప్పటివ‌ర‌కు రూ.39వేల విలువైన కోడి మాంసం తినేశాడా బ్యాంక్ మేనేజ‌ర్‌. కానీ, లోన్ మాత్రం మంజూరు చేయ‌లేదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మతగురువు రాసలీలలు.. ఆధ్యాత్మిక భార్యలు అంటూ 20 మందిపై..

ట్రంప్‌ కీలక నిర్ణయం.. భారతీయులకు గుడ్‌ న్యూస్‌ అవుతుందా ??

అరటి పండు గొడవ.. రైళ్లనే ఆపేసిన కోతులు !!

అంగరంగ వైభవంగా ఆవుదూడకు గ్రాండ్‌గా ఉయ్యాల ఫంక్షన్‌ !!

పుట్టుడు దుఃఖంతో రంది పెట్టుకుంటే.. చివరికి పండులాంటి బిడ్డ పుట్టాడు