Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangalore rave Party: బెంగళూరు రేవ్‌పార్టీ కేసులో మాదకద్రవ్యాల సరఫరాదారు అరెస్ట్‌..

Bangalore rave Party: బెంగళూరు రేవ్‌పార్టీ కేసులో మాదకద్రవ్యాల సరఫరాదారు అరెస్ట్‌..

Anil kumar poka
|

Updated on: Jun 06, 2024 | 9:36 PM

Share

బెంగళూరు నగర శివార్లలో ఇటీవల సంచలనానికి కారణమైన రేవ్‌పార్టీలో పాల్గొన్న వారికి మాదక ద్రవ్యాలు సరఫరా చేశాడనే ఆరోపణపై దేవరజీవనహళ్లి నివాసి ఇమ్రా షరీఫ్‌ అనే వ్యక్తిని సీసీబీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ కేసు విచారణను శరవేగంగా కొనసాగిస్తున్న అధికారులు మరిన్ని ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆ యువకుడి నుంచి 40 ఎండీఎంఏ బిళ్లలను స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరు నగర శివార్లలో ఇటీవల సంచలనానికి కారణమైన రేవ్‌పార్టీలో పాల్గొన్న వారికి మాదక ద్రవ్యాలు సరఫరా చేశాడనే ఆరోపణపై దేవరజీవనహళ్లి నివాసి ఇమ్రా షరీఫ్‌ అనే వ్యక్తిని సీసీబీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ కేసు విచారణను శరవేగంగా కొనసాగిస్తున్న అధికారులు మరిన్ని ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆ యువకుడి నుంచి 40 ఎండీఎంఏ బిళ్లలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుల సూచనతోనే సరకు సమకూర్చానని చెప్పాడన్నారు. ఈ పార్టీ కోసం ఏకంగా రూ.50 లక్షలు ఖర్చు చేశారని, హైదరాబాద్‌ నివాసి వాసు పుట్టిన రోజు పేరిట పార్టీలో 150 మంది పురుషులు, మహిళలు పాల్గొన్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఈ పార్టీకి మాదకద్రవ్యాలు సమకూర్చారనే ఆరోపణపై ఇప్పటికే సిద్ధిక్, రణధీర్, రాజ్‌భావ అనే వ్యక్తులను కటకటాల వెనక్కినెట్టడం గమనార్హం.

మరోవైపు.. ఈ కేసులో తెలుగు సహాయ నటి హేమా ఎట్టకేలకు సోమవారమే సీసీబీ దర్యాప్తు అధికారుల ఎదుట లొంగిపోవడం నాటకీయతను తలపించింది. ఆమె పార్టీలో పాల్గొని, మాదకద్రవ్యాలు తీసుకున్నారనేది అభియోగం.సీసీబీ పోలీసులు ఆమెను బెంగళూరు శివారు ప్రాంతం అనేకల్ లోని జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ఏఎస్ సల్మా ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని విధించారు. అంతకుముందు రేవ్ పార్టీ గురించి సీసీబీ పోలీసులు ఆమెను వేర్వేరు కోణాల్లో విచారించారు. ఐదుగురితో కలిసి హేమ రేవ్ పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. హేమా బుర్కా ధరించి చామరాజపేటలోని సీసీబీ కార్యాలయంలోకి చేరుకున్నాక.. అధికారుల ప్రశ్నల వర్షంలో ఉక్కిరి బిక్కిరయ్యారు. ఆమె నుంచి ఏ ప్రశ్నకూ సరైన సమాధానం లభించకపోవడంతో చివరికి అరెస్టు చేశారు. పార్టీలో నేనేమీ పాల్గొనలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ తొలుత ఆమె బుకాయించడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అప్పట్లో ఆమె తీరుపై నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఆమె పాత్రను ధ్రువీకరించారు. ఆ పై పలువురి నుంచి ఫోన్లు చేయించి, కేసు నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఫోన్లు చేసే వారిపైనా కేసులు పెడతామనడంతో ఆమె లొంగిపోక తప్పని వాతావరణం తలెత్తింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.