బట్టతలకు బై బై.. ఇక 20 రోజుల్లోనే సహజంగా జుట్టు..!
నల్లని ఒత్తయిన జుట్టును అందరూ కోరుకుంటారు. అయితే.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు బట్ట తల సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా కాలేజీ వయసు పిల్లలకూ జుట్టు ఊడిపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఒకప్పుడు తన నెత్తిమీద ఒత్తుగా పెరిగిన జుట్టును తలచుకుని వీరంతా డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు.
ఇలాంటి వారందరికీ శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్ చెప్పారు. కేవలం 20 రోజుల్లో జుట్టు పెరుగుదలను పునరుద్ధరించగల ఒక అద్భుతమైన సీరంను అభివృద్ధి చేసినట్లు నేషనల్ తైవాన్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. పరిశోధనలో భాగంగా, ఎలుకలపై ఈ సీరంను ప్రయోగించారు. ఈ సీరం చర్మం క్రింద ఉండే కొవ్వు కణాలను ఉత్తేజపరిచి, జుట్టు కుదుళ్లను తిరిగి పెరిగేలా చేయడంలో విజయవంతమైంది. ఈ ప్రక్రియ హైపర్‌ట్రైకోసిస్ అనే విధానంపై ఆధారపడి ఉంటుందట. పరిశోధకుల ప్రకారం, ఈ సీరంలో సహజంగా లభించే ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. చర్మంపై దీనిని అప్లై చేసినప్పుడు, కొవ్వు కణాలు ఓలిక్ యాసిడ్, పామిటోలిక్ యాసిడ్ వంటి ఫ్యాటీ యాసిడ్లను విడుదల చేస్తాయి. ఈ ఆమ్లాలు జుట్టు కుదుళ్ల మూల కణాలను ఉత్తేజపరుస్తాయి, తద్వారా కొత్త జుట్టు పెరుగుదల ప్రారంభమవుతుంది. ఈ ఫ్యాటీ యాసిడ్లు చర్మానికి ఎలాంటి చికాకు కలిగించకుండానే ఈ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఈ సీరంను తాము మొదట్లో తమ కాళ్లపై ప్రయోగించుకోగా, మూడు వారాల్లోనే జుట్టు తిరిగి పెరిగినట్లు పరిశోధక బృందంలోని ప్రొఫెసర్ సంగ్-జాన్ లిన్ తెలిపారు. ఈ ఫలితాలు మానవ చర్మానికి కూడా వర్తిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ సీరంకు పేటెంట్ లభించింది. తదుపరి దశలో, దీనిని మానవులపై వివిధ మోతాదులలో పరీక్షించాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. త్వరలో ఈ సీరంను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పంటపొలాల్లో చిరుత.. వణికిపోతున్న రైతులు
బాలికపైనుంచి దూసుకెళ్లిన కారు.. ఆ తర్వాత..
రూ.240 కోట్ల లాటరీ గెలిచాడు.. ట్యాక్స్ లేకుండా మొత్తం అకౌంట్‌లోకి.. వర్కౌట్ అయిన అమ్మ సెంటిమెంట్
రెస్టారెంట్ బిల్లు ఎగ్గొట్టి .. ఖతర్నాక్ ప్లాన్ బెడిసికొట్టి..
