Elephant and Zebra: సో క్యూట్.. జీబ్రాతో పిల్ల ఏనుగు దోస్తీ .. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
Elephant and Zebra Friendship: ఇంటర్నెట్ లో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని షాక్ కి గురి చేస్తాయి.
ఇంటర్నెట్ లో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని షాక్ కి గురి చేస్తాయి. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా పాములు, పులులు, సింహాలు, ఏనుగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో రెండు విభిన్న జాతి జంతువుల మధ్య స్నేహబంధానికి సంబంధించినది. ఒక పిల్ల ఏనుగు, జీబ్రా పిల్ల మధ్య స్నేహాన్ని పంచుకునే వీడియో నెటిజన్లకు ఆకట్టుకుంటోంది.వీడియోలో పిల్ల ఏనుగు , జీబ్రా పిల్ల మధ్య స్నేహం చూడ ముచ్చటగా ఉంది. పిల్ల ఏనుగు ఆ జీబ్రా పిల్లను తన తొండంతో ముద్దు చేస్తోంది. ఇద్దరు స్నేహితులు ఒకరి భుజంపై ఒకరు చేయివేసుకున్నట్టుగా ఆ ఏనుగు పిల్ల జీబ్రా మెడ మీద తన తొండంతో నిమురుతోంది. ఒకదాన్ని ఒకటి ఆలింగనం చేసుకున్నట్టుగా ఆ రెండు పరస్పరం మూగభాషలో తమ స్నేహాన్ని పంచుకుంటున్నాయి. ఈ అందమైన వీడియో ఇంటర్‌నెట్ వేదికగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..