గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు.. చివరికి ??

టేకాఫ్​ అయిన 50 నిముషాలకు వర్జిన్ ఆస్ట్రేలియాకు చెందిన బోయింగ్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో కాసేపు ప్యాసింజర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో బిక్కచచ్చిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది న్యూజిలాండ్ సిటీ ఎయిర్​పోర్ట్​లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదని న్యూజిలాండ్​ ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు.. చివరికి ??

|

Updated on: Jun 19, 2024 | 11:27 PM

టేకాఫ్​ అయిన 50 నిముషాలకు వర్జిన్ ఆస్ట్రేలియాకు చెందిన బోయింగ్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో కాసేపు ప్యాసింజర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో బిక్కచచ్చిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది న్యూజిలాండ్ సిటీ ఎయిర్​పోర్ట్​లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదని న్యూజిలాండ్​ ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రయాణికుల సంఖ్య కూడా తెలియలేదని చెప్పారు. న్యూజిలాండ్​లోని క్వీన్స్‌ టౌన్ నుంచి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌​కు వెళ్లేందుకు వర్జిన్ ఆస్ట్రేలియా బోయింగ్ విమనం సోమవారం బయలుదేరింది. టేకాఫ్ అయిన 50 నిమిషాల తర్వాత ఇన్‌వర్‌కార్గిల్‌కు చేరుకోగానే ఇంజిన్​లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత న్యూజిలాండ్ సిటీ​ ఎయిర్​పోర్ట్​కు అత్యవసరంగా విమానాన్ని మళ్లించారు. అయితే పక్షి ఢీకొట్టడం వల్లే ఇంజిన్​లో మంటలు చెలరేగి ఉండవచ్చని వర్జిన్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కవలలకు జన్మనిచ్చిన ఏనుగు !! అరుదైన ఘటన ఎక్కడంటే ??

ప్రైవేట్​ జాబ్ చేస్తున్నారా ?? ‘గ్రాట్యుటీ’ ఎంత వస్తుందో తెలుసా ??

యాక్టింగ్ సూపర్ క్వీన్.. జైలులో రిమాండ్ మహిళా ఖైదీ హైడ్రామా

బైకును ఢీకొట్టి ఎగిరిపడ్డ ఆటో డ్రైవర్‌.. ఆ తర్వాత..

భార్య కంట్లో పడ్డ భర్త నిర్వాకం.. ఏం చేశాడో తెలుసా ??

Follow us