Marriage Problems: ‘వయసు దాటిపోతోంది.. పెళ్లి కూతుళ్లు దొరకట్లేదు సారూ’.. వెతికిపెట్టమంటూ మాజీ సీఎంకి అర్జీ..
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి వద్దకు తమ సమస్యలు చెప్పుకునేందుకు నిత్యం వందలాది మంది జనాలు ఫిర్యాదులతో వస్తుంటారు. రకరకాల కష్టాలు చెప్పుకుంటూ అర్జీలు పెట్టుకుంటారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి వద్దకు తమ సమస్యలు చెప్పుకునేందుకు నిత్యం వందలాది మంది జనాలు ఫిర్యాదులతో వస్తుంటారు. రకరకాల కష్టాలు చెప్పుకుంటూ అర్జీలు పెట్టుకుంటారు. అయితే ఓ యువకుడు ఈ మాజీ సీఎంకి ఓ విచిత్రమైన అర్జీ పెట్టుకున్నాడు. తాను పెళ్లి చేసుకోవడానికి వధువు దొరకడం లేదంటూ హెచ్‌డి కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు.అవును, కోలారు జిల్లా పంచరత్న యాత్రలో కుమారస్వామి.. గ్రామస్తులు, రైతుల కష్టాలు వింటూ ఉన్నారు. ఇంతలో ముదువతి గ్రామానికి చెందిన ధనంజయ అనే యువకుడు కుమార స్వామికి ఓ వినతిపత్రం ఇచ్చాడు. పెళ్లి చేసుకోవడానికి వధువులు దొరకడం లేదంటూ అందులో ప్రస్తావించాడు. ‘ఒక్కలిగ’ రైతు యువకులకు పెళ్లి వయసు దాటినా వధువులు రావడం లేదని, ఒక్కలిగ యువకులకు వధువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కుమారస్వామిని లేఖ ద్వారా అభ్యర్థించాడు.‘కోలార్‌లో రైతు యువకులు వధువుల కొరతను ఎదుర్కొంటున్నారు. మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన జిల్లాకు చెందిన వధువులను ఇతర జిల్లాలకు చెందిన వరులను పెళ్లి చేసుకోకూడదనే నిబంధనను అమలు చేయాలి. నువ్వు మాకు వధువులను వెతకాలి’ అని ధనంజయుడు కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. కుమారస్వామి సీఎం కావడం ఖాయమని, జేడీఎస్ ప్రభుత్వంలో ఈ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ధనంజయ కోరాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

