ఈ మాల్‌‌లో అన్నీ ఫ్రీ !! దుస్తులు, వస్తువులు ఎంచక్కా తీసుకెళ్లొచ్చు !!

Phani CH

Phani CH |

Updated on: Jan 30, 2023 | 9:44 PM

షాపింగ్‌ మాల్‌ అనగానే విశాలమైన బిల్డింగ్.. కళ్లు చెదిరే అద్దాలు, కాంతులీనే దీపాల మధ్య అమ్మకానికి పెట్టిన ఖరీదైన దుస్తులే కనపడతాయి. అయితే ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని రహీంనగర్‌ అనోఖా మాల్‌ మాత్రం దీనికి విరుద్ధం.

షాపింగ్‌ మాల్‌ అనగానే విశాలమైన బిల్డింగ్.. కళ్లు చెదిరే అద్దాలు, కాంతులీనే దీపాల మధ్య అమ్మకానికి పెట్టిన ఖరీదైన దుస్తులే కనపడతాయి. అయితే ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని రహీంనగర్‌ అనోఖా మాల్‌ మాత్రం దీనికి విరుద్ధం. ఆ మాల్‌లో పేదలకు అవసరమైన దుస్తులే ఉంటాయి. వారు అందులోకి ఠీవీగా వెళ్లి ఎవరినీ చేయి చాచి అడగకుండా తమకు నచ్చిన వాటిని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. చలికాలంలో ఇక్కడి పేదలు, కార్మికులు ఇబ్బంది పడడాన్ని చూసి చలించిపోయారు రహీంనగర్‌కు చెందిన డాక్టర్ అహ్మద్‌ రజాఖాన్‌. ఆ ఆవేదనలోంచి ఐదేళ్ల క్రితం పుట్టిన ఆలోచనే అనోఖా మాల్‌. ఈ మాల్‌లో దాతలు అందించిన స్వెటర్లు, బ్లాంకెట్లు, దుప్పట్లతోపాటు చెప్పులు, సూట్‌కేసులు, స్కూల్‌ యూనిఫాం తదితరాలను ఉంచుతారు. కార్మికులు, మురికివాడల్లో నివాసముండే పేదలు వీటిని తీసుకెళ్లి ఉపయోగించుకుంటారు. సాయం కోసం అర్థించకుండా ఆత్మగౌరవంతో ఇక్కడి వస్తువులను ఉచితంగా తీసుకోవచ్చని అదే ఇక్కడ ప్రత్యేకత అని అహ్మద్‌ తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నూడుల్స్ తయారీ వీడియో చూస్తే.. తినడానికి భయపడతారేమో !!

Follow us

Click on your DTH Provider to Add TV9 Telugu