కారడవిలో జలకన్య.. ఈదుకుంటూ వెళ్లి పూజలు

|

Aug 03, 2023 | 9:55 PM

తెలుగు రాష్ట్రాల్లో జలపాతాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ములుగు జిల్లాలోని వాజేడు - వెంకటాపురం మండలాల్లో ఓ వింత ఆశ్చర్య పరుస్తోంది. జలపాతాల సందర్శనకు వెళ్ళే వారు నివ్వెరబోయేలా చేస్తోంది. వాజేడు మండలంలోని మైతాపురం అడవుల్లో జలపాతాల వద్ద మొట్ట మొదట ఓ విగ్రహ రూపం బయట పడింది.

తెలుగు రాష్ట్రాల్లో జలపాతాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ములుగు జిల్లాలోని వాజేడు – వెంకటాపురం మండలాల్లో ఓ వింత ఆశ్చర్య పరుస్తోంది. జలపాతాల సందర్శనకు వెళ్ళే వారు నివ్వెరబోయేలా చేస్తోంది. వాజేడు మండలంలోని మైతాపురం అడవుల్లో జలపాతాల వద్ద మొట్ట మొదట ఓ విగ్రహ రూపం బయట పడింది. బయటపడ్డ రూపాన్ని జలకన్య విగ్రహంగా భావించి పూజలు చేస్తున్నారు గిరిజనవాసులు. పక్కనే మరి కొన్ని శిలా రూపాలు బయటపడ్డాయి. ఇక్కడ ప్రత్యక్షమైన ప్రతి రూపాలలో జలకన్య, నాగ కన్య, మచ్చ కన్య, చంద్రకన్య, ముని కన్య అనే ఐదు ఆకారాలను గుర్తించారు. వీటి ఆకారాలను బట్టి ఇక్కడ పొలిమేర దేవతలు కొలువయ్యారని.. వారే వరంగల్ ఉమ్మడి జిల్లాను రక్షిస్తున్నారని భావిస్తున్నారు. విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.మైతాపురం అడవుల్లో గుట్టపై ప్రత్యక్షమైన ప్రతిమ వద్దకు వెళ్లాలంటే అంత ఆషామాషికాదు. జలపాతం వరదల్లో ఈదుకుంటూ సాహసపేతంగా అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: అడ్డంగా బుక్కైన అంబటి.. ఇదిగో ప్రూఫ్‌.. | గెట్‌వెల్‌ సూన్‌

Digital TOP 9 NEWS: విశాఖ తీరంలో వాహ్‌వా టెర్మినల్ | బ్యూటీ పార్లర్‌కెళితే బోడి గుండైంది..!

ఏడాది వయసులోనే అద్భుత ప్రతిభ చూపుతున్న చిన్నారి

వింత వివాహం.. యూపీ యువతికి పరమశివుడితో పెళ్లి !!

బ్యూటీషియన్లకు ఇక మూడినట్లే .. వీటి వల్ల క్యాన్సర్‌ ముప్పు

 

Follow us on