వింత వివాహం.. యూపీ యువతికి పరమశివుడితో పెళ్లి !!
భగవంతుడిని వివాహమాడటం అనేది మానవుల విషయంలో జరగడం అసంభవం. కేవలం దేవీదేవతలకే అది జరుగుతుంది. అయితే భక్తమీరా భగవంతుడినే సర్వస్వంగా భావించి తనని తాను భగవంతుడికి సమర్పించుకుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి శివుడిని వివాహమాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.
భగవంతుడిని వివాహమాడటం అనేది మానవుల విషయంలో జరగడం అసంభవం. కేవలం దేవీదేవతలకే అది జరుగుతుంది. అయితే భక్తమీరా భగవంతుడినే సర్వస్వంగా భావించి తనని తాను భగవంతుడికి సమర్పించుకుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి శివుడిని వివాహమాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. శివుడే తన సర్వస్వంగా నమ్మిన ఆ యువతి తల్లిదండ్రులు, పెద్దల అంగీకారంతో శివుడిని వివాహం చేసుకుంది. ధుమిత్రుల సమక్షంలో, బ్యాండు బాజాల నడుమ పల్లకిలో ఊరేగింపుగా వెళ్లి మరీ యువతి శివుడిని వివాహమాడింది. శివుని విగ్రహానికి పూల మాల వేసి ఆయనకు తనను తాను అర్పించుకుంది. భగవంతుడిపై భక్తితో ఆయన్ను భర్తగా స్వీకరిచించింది. దీంతో ఈ పెళ్లి స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ అరుదైన సంఘటన ఝాన్సీ జిల్లాలో జరిగింది. అన్నపూర్ణ కాలనీకి చెందిన ఓ యువతి శివుడిని పెళ్లాడింది. యువతి ఆమె తల్లిదండ్రులు..చాలా కాలంగా బ్రహ్మకుమారి సంస్థలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే యువతి శివుడిపై మమకారాన్ని పెంచుకుంది. ఆయన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కూతురు నిర్ణయానికి ఆమె పేరెంట్స్ కూడా స్వాగతించారు. ఇక తన జీవితాన్ని పరమశివుడికి అంకితం చేయాలని యువతి నిశ్చయించుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

