ఈ సారు మామూలోడు కాదు.. సర్కారు ఆఫీస్‌లోనే ఏకంగా మకాం పెట్టాడు…
అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గుంతకల్ RDO కార్యాలయంలో పనిచేస్తున్న ఏవో నాగభూషణం తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. RDO కార్యాలయం అనుకున్నారో లేక.. తన స్వంత ఇళ్లు అనుకున్నారో తెలియదు కానీ.. తాను విధులు నిర్వహించే ఛాంబర్‌లోనే కాపురం పెట్టేంత పనిచేశారు. ఛాంబర్‌లో మంచం ఏర్పాటు చేసుకొని బెడ్ రూమ్‌గా వాడుకుంటున్నారు ఏవో.
ప్రతిరోజు రెవెన్యూ కార్యాలయంలోనే పడకేస్తున్నాడు. ఈవ్యవహారం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఇంతేకాదు ఆఫీస్ లోని కింది స్థాయి స్టాప్‌తో నాగభూషణం ఛాంబర్ శుభ్రం చేయించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. అంతటితో ఆగకుండా రాత్రిపూట ఉద్యోగాలు నిర్వహిస్తున్న కార్యాలయ సిబ్బందిని కూడా తాను ఉన్నంతవరకే ఇక్కడ ఉండాలంటూ హూకూం జారీ చేస్తున్నాడు. అయితే ఈ వ్యవహారం ఆర్డీవోకు తెలిసే జరుగుతుందా? లేక తెలియలేదా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఒకవేళ ఏవో చేష్టలు తెలిసి కూడా చూసి చూడనట్లు ఆర్డీవో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని తన సొంత ఇంటిగా వాడుకోవడంపై ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఈ ఘటనపై జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ఏవో నాగభూషణంపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని.. ఇంత జరుగుతున్న నిర్లక్ష్యంగా ఉన్న ఆర్డీవోపై కూడా యాక్షన్ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రమాదకర ‘మోబ్’ బాంబ్ తో.. ఇరాన్‌పై దాడికి ట్రంప్ ప్లాన్?
గల్లంతైన అలాస్కా విమానం దొరికింది
బహిష్కరణ భయంతో అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
ఒళ్లంతా మొద్దుబారిపోయే.. పక్షవాతం లాంటి జబ్బు..
దుస్తులు తీసేసి ఫోటోలకు ఫోజులు.. గ్రామీ వేడుకల్లో షాకింగ్ ఘటన

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
