ప్రమాదకర ‘మోబ్’ బాంబ్ తో.. ఇరాన్‌పై దాడికి ట్రంప్ ప్లాన్?
ప్రపంచంలోని అతి ప్రమాదకరమైన భారీ బాంబు ని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశంపై ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ అత్యంత శక్తివంతమైన బాంబు ఒక నాన్-న్యూక్లియర్ బాంబు. దీనినే మోబ్ బాంబ్ అని పిలుస్తారు. దీన్ని ఇజ్రాయెల్ కు బహుమతిగా అమెరికా ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది.
ఇరాన్ అణు బాంబు తయారీ ఉద్దేశాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పనిచేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఇటీవల సమావేశమయ్యారు. ఈ చర్చల దరిమిలా, అమెరికా నుంచి మోబ్ బాంబును ఇజ్రాయెల్ స్వీకరించబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ తనను అంతమొందించే పక్షంలో, ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలని నెతన్యాహు ట్రంప్‌ను కోరినట్లు తెలుస్తోంది. మోబ్ బాంబు వార్తలు పశ్చిమాసియా ప్రాంతాన్ని కలవరపెడుతున్నాయి. సంవత్సరాల తరబడి కాకుండా, నెలల వ్యవధిలోనే అణ్వస్త్రాన్ని తయారు చేసే మార్గాలను ఇరాన్ శాస్త్రవేత్తలు చురుగ్గా అన్వేషిస్తున్నారని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఒక వార్తాకథనంలో ప్రచురించింది. ఈ నేపథ్యంలో, ఇరాన్ అణు పరిశోధనా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడానికి మోబ్ బాంబును అమెరికా ఇజ్రాయెల్‌కు పంపుతోందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.30 అడుగుల పొడవైన ‘మోబ్’ విషయానికొస్తే.. ఈ బాంబులో 11 టన్నుల పేలుడు పదార్థం ఉంటుంది. దీని పేలుడు ప్రభావానికి 300 మీటర్ల వెడల్పున పెద్ద గొయ్యి ఏర్పడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గల్లంతైన అలాస్కా విమానం దొరికింది
బహిష్కరణ భయంతో అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
ఒళ్లంతా మొద్దుబారిపోయే.. పక్షవాతం లాంటి జబ్బు..
దుస్తులు తీసేసి ఫోటోలకు ఫోజులు.. గ్రామీ వేడుకల్లో షాకింగ్ ఘటన
కుంభమేళా ట్రాఫిక్ జామ్ లో.. బస్సు టాప్ పై వీళ్లు ఏం చేశారంటే..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
