కుంభమేళా ట్రాఫిక్ జామ్ లో.. బస్సు టాప్ పై వీళ్లు ఏం చేశారంటే..
మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అన్నిదారులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వైపే కదులుతున్నాయి. దాదాపు 45 కోట్ల మంది ఈ కుంభమేళాకు హాజరవుతారని అధికారులు వేసుకున్న అంచనాలు నిజమవుతున్నాయి. ఇప్పటికే పాతిక కోట్ల మందికి పైగా ప్రయాగరాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించినట్టు తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీ వరకు ఈ కుంభమేళా జరుగుతుంది.
కోట్ల మంది వస్తుండడంతో ప్రయాగ్‌రాజ్ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్‌లు జరుగుతున్నాయి. చాలా మంది టూరిస్ట్ బస్సులలో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో వాహనాలు రోడ్ల మీదనే ఆగిపోతున్నాయి. బస్సు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవడం, చాలా నెమ్మదిగా కదులుతుండడంతో కొందరు వ్యక్తులు టూరిస్ట్ బస్సు టాప్ పైకి చేరుకుని హాయిగా పేకాట ఆడారు. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయామనే బాధ లేకుండా చక్కగా టైమ్ పాస్ చేశారు. ఆ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన మొబైల్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. “అద్భుతమైన ఆలోచన“, “ట్రాఫిక్ జామ్ చిరాకు నుంచి తప్పించుకోవడానికి అద్భుతమైన ప్లాన్“ అంటూ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీకు తరచూ ఆకలిగా అనిపిస్తుందా? కారణం ఇదే
సన్యాసం తీసుకున్న మరో హీరోయిన్.. ఇదేంటిలా?
షాకింగ్ న్యూస్.. సాయిపల్లవి డైరెక్షన్లో… నాగ చైతన్య హీరోగా సినిమా!

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
