బహిష్కరణ భయంతో అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం.. కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపింది. చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. బహిష్కరణ భయంతో అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో అతడు ఏ ప్రాంతానికి చెందిన వాడన్న వివరాలు తెలియరాలేదు.
అతడి స్నేహితుడి కథనం ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న యువకుడి పేరు సాయికుమార్‌రెడ్డి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు న్యూయార్క్ వెళ్లాడు. అక్కడే తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నాడు. సాయికుమార్‌రెడ్డి పనిచేసే చోట కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. సాయికుమార్‌రెడ్డి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనను కూడా బహిష్కరిస్తారన్న భయంతో పనిచేస్తున్న చోటే సాయికుమార్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒళ్లంతా మొద్దుబారిపోయే.. పక్షవాతం లాంటి జబ్బు..
దుస్తులు తీసేసి ఫోటోలకు ఫోజులు.. గ్రామీ వేడుకల్లో షాకింగ్ ఘటన
కుంభమేళా ట్రాఫిక్ జామ్ లో.. బస్సు టాప్ పై వీళ్లు ఏం చేశారంటే..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
