ఒళ్లంతా మొద్దుబారిపోయే.. పక్షవాతం లాంటి జబ్బు..
ఏంటో ఈ వింత రోగాలు. ఎక్కడి నుంచి ఎలా పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదు. మొన్న కొద్ది రోజులు చైనా HMPV వైరస్ టెన్షన్ పెట్టింది. అమ్మో..మళ్లీ కరోనా లాంటి మహమ్మారి చుట్టుముడుతుందేమో అని భయపడిపోయారు. కానీ...అదృష్టం కొద్దీ అలాంటిదేమీ జరగలేదు. ఆ వైరస్ పెద్దగా ప్రభావం చూపించలేదు. పర్లేదు..అని కాస్త ఊపిరి పీల్చుకునేలోగా మరో వ్యాధి ముంచుకొచ్చింది.
గులియన్ బారే సిండ్రోమ్ అనే కొత్త జబ్బు కొత్త ఆందోళనతో పాటు అనుమానాలను పుట్టిస్తోంది. మహారాష్ట్రలోని పుణెలో మొదలైన ఈ వ్యాప్తి…ఇంకా కొనసాగుతూనే ఉంది. జనవరి నుంచి ఇప్పటి వరకూ 160 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 48 మంది బాధితులు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. మరో 21 మంది వెంటిలేటర్‌పై ఉన్నారు. ఇదంతా చూస్తుంటే…ఈ వ్యాధి గట్టిగానే ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. GBS గా పిలుచుకుంటున్న ఈ జబ్బు..పుణేలోని ప్రజల్ని వణికిస్తోంది. ఐటీ హబ్‌తో పాటు మరెన్నో పరిశ్రమలకు కేంద్రమైన పుణేలో ఈ కేసులు పెరుగుతుండడం.. రాబోయే ఉపద్రవాన్ని కళ్లకు కడుతోంది. ఈ వ్యాధికి సంబంధించి మొర్టాలిటీ రేట్..అంటే చనిపోయే అవకాశం 3 నుంచి 13% వరకూ ఉంటోందని చెబుతున్నారు వైద్యులు. కాకపోతే..ఇది పరోక్షంగా మెడికేషన్‌పై ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు. బాధితులు ఎక్కడ వైద్యం తీసుకుంటున్నారు..? అక్కడ సరైన సౌకర్యాలు ఉన్నాయా లేదా అన్న దానిపైనే మొర్టాలిటీ రేట్‌ని డిసైడ్ చేయొచ్చని అంటున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే..ఈ సిండ్రోమ్ వచ్చాక కేవలం కొద్ది గంటల్లోనే శరీరంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దుస్తులు తీసేసి ఫోటోలకు ఫోజులు.. గ్రామీ వేడుకల్లో షాకింగ్ ఘటన
కుంభమేళా ట్రాఫిక్ జామ్ లో.. బస్సు టాప్ పై వీళ్లు ఏం చేశారంటే..
మీకు తరచూ ఆకలిగా అనిపిస్తుందా? కారణం ఇదే
సన్యాసం తీసుకున్న మరో హీరోయిన్.. ఇదేంటిలా?
షాకింగ్ న్యూస్.. సాయిపల్లవి డైరెక్షన్లో… నాగ చైతన్య హీరోగా సినిమా!

అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..

కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా అనుమతి కావలి

విశాఖ బీచ్లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే

గర్ల్స్ హాస్టల్లో అనుమానాస్పద వస్తువు.. ఏమిటా అని చూడగా !!

త్వరగా వెళ్లేందుకు బైకుపై రైల్వే గేటు దాటుతున్న మహిళ.. చివరికి..

కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు

పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వధూవరులు.. వీడియో చూస్తే
