UFO Video: ఈ అనంత విశ్వంలో మనిషి ఒంటరి కాదా.? ఇంత పెద్ద విశ్వంలో ఏదో ఒక చోట గ్రహాంతర వాసులు ఉండే ఉంటారా.? ఈ ప్రశ్న ఎన్నో ఏళ్ల నుంచి తలెత్తుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు భూమిపైకి వస్తున్నట్లు కనిపించే కొన్ని ఫ్లయింగ్ సాసర్లను పోలిన వస్తువులు (యూఎఫ్‌వో) ఏలియన్స్ ఉనికి నిజమేనని వస్తోన్న వార్తలకు బలానికి చేకూరుస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా అమెరికా రాడర్ చిత్రీకరించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. అమెరికాకు చెందిన డ్యాక్యుమెంటరీ ఫిలిమ్ దర్శకుడు జెరీమీ కార్బెల్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌వోలు చుట్టుముట్టినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఇందులో 9 వస్తువులు నౌకకు దగ్గరగా రావడం కనిపించింది. కాలిఫోర్నియాలోని శాన్ డియెగో తీరానికి చేరువలో 2019 జులైలో ఈ ఘటన జరిగిందని కార్బెల్ ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియో ఫుటేజ్.. నిజమైందేనని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. యుద్ధనౌకను చుట్టుముట్టిన యూఎఫ్‌వోలు 70 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు కార్బెల్ తెలిపారు. కొద్ది సేపటి తర్వాత రాడార్ తెరపై నుంచి అవి అదృశ్యమైనట్లు ఆయన వివరించారు. రాడార్ పరిధికి అందకుండా అవి వెళ్లిపోయి ఉంటాయని ఆయన తెలిపారు. మరి ఇప్పటి వరకు సినిమాలకే పరిమితం అయిన గ్రహాంతర వాసులు నిజంగానే మనుషులను కలిసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయా? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
2019 US Navy warships were swarmed by UFOs; here’s the RADAR footage that shows that. Filmed in the Combat Information Center of the USS Omaha / July 15th 2019 / this is corroborative electro-optic data demonstrating a significant UFO event series in a warning area off San Diego. pic.twitter.com/bZS5wbLuLl
— Jeremy Corbell (@JeremyCorbell) May 27, 2021
Also Read: Chitragupta Swamy Temple: భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..? ప్రత్యేకత ఏమిటి..?
Lakshadweep: లక్షద్వీప్ లో స్థానికుల నిరసనలకు మద్దతుగా కోర్ కమిటీ ఏర్పాటు చేయనున్న విపక్షాలు