వారెవ్వా.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్ గురూ.. కానీ..
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. స్మగ్లింగ్ చేయడంలో పుష్పను మించి మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. స్మగ్లింగ్ చేయడంలో పుష్పను మించి మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలకు మస్కా కొట్టి గంజాయి సరిహద్దులు దాటించేస్తున్నారు. తాజాగా ఈ స్మగ్లర్ల ఐడియాకి అధికారుల మైండ్ బ్లాంక్ అయిపోయింది. బోలెరో వాహనంటాప్ పైన ప్రత్యేక అరను ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టును.. రట్టు చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఈబీ పోలీసులు. డుంబ్రిగూడ మండలం కించుమండ దగ్గర గంజాయి ముఠాను పట్టుకున్నారు ఎస్ఈబీ పోలీసులు. అనుమానాస్పదంగా వెళుతున్న బొలేరోను ఆపి తనిఖీలు చేశారు. ఎక్కడా ఏమీ కనిపించకపోయేసరికి అనుమానం వచ్చింది పోలీసులకు. మళ్లీ వాహనాన్ని క్షుణంగా పరిశీలించారు.
Also Watch:
రైల్వే కౌంటర్ లో టికెట్ కొంటున్నారా.. అయితే ఈ వీడియో మీ కోసమే !!
ఇళ్లకు తాళాలు.. మంటల్లో భవనం.. బయటకు రాలేక.. సజీవసమాధులైన 10 మంది
తాత కానున్న బిల్‌గేట్స్.. కూతురి బేబీ బంప్ ఫొటోలు వైరల్..