ఆలయంలో అద్భుత ఘటన.. పోటెత్తిన జనం !! వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

కామారెడ్డి జిల్లాలో వింతఘటన చోటుచేసుకుంది. ఓ ఆలయంలోని శివలింగంపై భారీ నాగుపాము ప్రత్యక్షమైంది. శివలింగానికి అలంకరించిన నాగాభరణంలా నాగుపాము దర్శనమిచ్చింది.

ఆలయంలో అద్భుత ఘటన.. పోటెత్తిన జనం !! వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

|

Updated on: Dec 01, 2022 | 9:35 AM

కామారెడ్డి జిల్లాలో వింతఘటన చోటుచేసుకుంది. ఓ ఆలయంలోని శివలింగంపై భారీ నాగుపాము ప్రత్యక్షమైంది. శివలింగానికి అలంకరించిన నాగాభరణంలా నాగుపాము దర్శనమిచ్చింది. దోమకొండ శివారులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. అందులో పరమశివుని ఆలయం కూడాఉంది. తెల్లని విభూదితో కాంస్య నాగాభరణం ధరించి ఎంతో శోభాయమానంగా ఉన్న ఆ పరమేశ్వరుని సేవించేందుకు ఓ నాగుపాము వచ్చింది. కొద్దిసేపు లింగాన్ని చుట్టుకొని ఉంది. అనంతరం శివ లింగం చుట్టూ సుమారు గంట పాటు నాగుపాము ప్రదక్షిణలు చేసింది. దీంతో ఈ వింతను చూడడానికి భారీగా భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. శివనామ స్మరణంతో ఆలయ ప్రాంతం మార్మోగిపోయింది. అయితే ఆలయంలో నాగు పాము ఉండటం ప్రమాదం అనుకున్న స్థానికులు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. అతను పాముని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని సమీపంలో దట్టమైన ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వే కౌంటర్ లో టికెట్ కొంటున్నారా.. అయితే ఈ వీడియో మీ కోసమే !!

ఇళ్లకు తాళాలు.. మంటల్లో భవనం.. బయటకు రాలేక.. సజీవసమాధులైన 10 మంది

తాత కానున్న బిల్‌గేట్స్‌.. కూతురి బేబీ బంప్ ఫొటోలు వైరల్‌..

2,500 మందితో న‌గ్న ఫోటోషూట్‌.. ఎందుకంటే ??

వామ్మో.. 66 ఏళ్ల వృద్ధుడిపై 31 అత్యాచార కేసులు !!

 

Follow us