Thieves Stealing: తస్మాత్‌ జాగ్రత్త.! బ్రాండెడ్‌ కార్లపై మనసు పారేసుకుంటున్న దొంగలు..!(వీడియో)

Updated on: Oct 25, 2022 | 9:31 PM

దేశంలో దొంగలు రూటు మార్చారు. నిన్న మొన్నటి వరకు చోరీకి వెళ్లి చేతికి ఏది దొరికి అది దొంగిలించేవారు. కానీ ఇప్పుడు సెలక్ట్‌ చేసుకొని మరి దొంగతనం చేస్తున్నారు. ముఖ్యంగా బ్రాండెడ్‌ కార్లపై దొంగలు మనసు పారేసుకుంటున్నారట.

ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎకో నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 56 శాతం కంటే ఎక్కువ వాహనాలు ఢిల్లీ NCRలో చోరీకి గురైనట్లు తేలింది. ఇక , మారుతి సుజుకి, హ్యుందాయ్‌ బ్రాండ్లు దేశంలో అత్యధికంగా దొంగిలించబడిన కార్లు జాబితాలో స్థానం సంపాదించగా.. హీరో స్ల్పెండర్‌ బైక్‌లను దొంగలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దేశంలో వాహన దొంగతనాల విషయానికి వస్తే, వాహన దొంగతనాల కేసుల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ తర్వాత బెంగళూరు 9 శాతం, చెన్నై 5 శాతం ఉన్నాయి. కాగా, దేశంలోనే అతి తక్కువ వాహనాల దొంగతనాలు జరుగుతున్న నగరాలుగా హైదరాబాద్, ముంబై, కోల్‌కతా నిలిచాయి. కారు రంగు విషయానికి వస్తే తెల్లటి కార్లు ఎక్కువగా దొంగతనానికి గురవుతాయట. తెల్ల కార్లను దొంగతనం చేయడానికి కారణం..ట్రాఫిక్‌లో గుర్తించ లేకపోవడం, తెల్లటి కార్ల రంగును మార్చడం చాలా సులభం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 25, 2022 09:31 PM