Snake In Bank: బ్యాంకులో ఐదడుగుల నాగుపాము హల్‌చల్.. భయబ్రాంతులకు గురైన బ్యాంక్ సిబ్బంది..
బ్యాంకులో చొరబడిన నాగుపాము హల్‌చల్ రేపింది. దీంతో ఖాతాదారులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. కాట్రేనికోన మండలం కందికుప్ప చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఉంది.
బ్యాంకులో చొరబడిన నాగుపాము హల్‌చల్ రేపింది. దీంతో ఖాతాదారులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. కాట్రేనికోన మండలం కందికుప్ప చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఉంది. ఖాతాదారులు వేచివున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన పాము బ్యాంకులోకి దూరింది. ఐదగుల పొడవున్న నాగుపాము బ్యాంకులోకి ప్రవేశించడాన్ని గుర్తించిన ఖాతాదారులు, సిబ్బంది కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. ఇంతలో కందుకుప్ప గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ నూకల బాబ్జికి సమాచారం ఇచ్చారు. నాగుపాము ను చాకచక్యంగా పెట్టెలో బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలివేశారు. దాదాపు అర్ధగంట పాటు శ్రమించి పామును పట్టుకోవడంతో ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.