Murder: షాపులో దాక్కున్నా మరీ.. కత్తులతో వేటాడి, విచక్షణా రహితంగా నరికిన దుండగులు..(వీడియో)
గుంటూరులో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వేటాడి, వెంటాడి కత్తులతో దాడి చేసి, హత్య చేశారు. లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఏటుకూరు సెంటర్‌లోని ఓ దుకాణం ముందు నిల్చుని ఉన్న రమేశ్ అనే వ్యక్తిపై..
గుంటూరులో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వేటాడి, వెంటాడి కత్తులతో దాడి చేసి, హత్య చేశారు. లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఏటుకూరు సెంటర్‌లోని ఓ దుకాణం ముందు నిల్చుని ఉన్న రమేశ్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ప్రాణరక్షణ కోసం దుకాణంలోకి వెళ్లి దాక్కునేందుకు ప్రయత్నించగా వెంటాడి మరీ చంపారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. రమేశ్.. ఫైనాన్స్ వ్యాపారంతో పాటు శుభకార్యాలకు డెకరేషన్ పనులు చేస్తుంటాడు. సమాచారం అందుకున్న గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రమేశ్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన సంఘటనకు ముందు రమేశ్ ఇంట్లోనే ఉన్నారని, స్నానానికి నీళ్లు పెట్టేలోగా ఎవరో ఫోన్ చేసి పిలవగా బయటకు వచ్చి హత్యకు గురయ్యారని మృతుడి తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. కాగా.. రమేష్‌పై గుంటూరు లాలాపేట స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. గతంలో పాతగుంటూరులోని చాకలికుంట వద్ద జరిగిన ఓ హత్య కేసులో ఇతను నిందితుడు అని పోలీసులు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

