Kashmir: 32 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో ప్రారంభంకానున్న సినిమా థియేటర్
కశ్మీర్‌లో 1990వ సంవత్సరంలో తీవ్ర హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రజలకు సినిమా వినోదం దూరమైంది.
కశ్మీర్‌లో 1990వ సంవత్సరంలో తీవ్ర హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రజలకు సినిమా వినోదం దూరమైంది. ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందోనన్న భయాందోళనల కారణంగా సినిమా థియేటర్లు మూసివేశారు. అయితే తాజాగా చాలా ఏళ్ల తర్వాత కశ్మీరీ ప్రజలకు సినిమా వినోదం మళ్లీ చేరువ కానుంది. ఇందుకు ఐనాక్స్ సంస్థ శ్రీనగర్‌లో మల్టీప్లెక్స్ నిర్మిస్తోంది. ఇది వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ మల్టీప్లెక్స్‌లో మూడు స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది ఐనాక్స్. అత్యాధునిక సౌండ్ సిస్టమ్, సౌకర్యవంతమైన సీటింగ్‌తో ఈ థియేటర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఈ మల్టీప్లెక్స్ సీటింగ్ సామర్థ్యం 520 సీట్లుగా ఉంది. ఇందులో ఫుడ్ కోర్టులు, చిన్నారులు ఆడుకునేందుకు మెషీన్ టాయ్స్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Gopal Varma: RRR, KGF2 కంటే కార్తికేయ2 బిగ్గెస్ట్ హిట్..
బికినీ వేసుకుంటా.. మీకేంటి ?? ఇచ్చిపడేసిన హీరోయిన్ !!
Nikhil: ముంబయ్ థియేటర్లో నిఖిల్.. రెస్పాన్స్ చూసి ఎమోషనల్
Karthikeya 2: దిమ్మతిరిగే రికార్డ్.. 7 రోజుల్లోనే అన్‌స్టాపబుల్‌గా కార్తికేయ 2
Godfather: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గాడ్ ఫాదర్ టీజర్..