Viral Video: ఇంటిని దోచుకుని, కలెక్టర్‌కు లేఖ రాసిన దొంగలు..! నెట్టింట వైరల్‌ అవుతున్న వార్త..(వీడియో)

|

Oct 15, 2021 | 7:20 PM

దొంగలు సాధారణంగా దోపిడీ చేసిన తర్వాత ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా పారిపోతారు. కానీ ఈ దొంగలు దేశ ముదుర్లు అనుకుంటా.. దొంగతనానికి వచ్చి, అందినకాడికి దోచుకున్నది కాకుండా కలెక్టర్‌కి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించిన ఓ విషయం నెట్టింట వైరల్‌ అవుతోంది.

దొంగలు సాధారణంగా దోపిడీ చేసిన తర్వాత ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా పారిపోతారు. కానీ ఈ దొంగలు దేశ ముదుర్లు అనుకుంటా.. దొంగతనానికి వచ్చి, అందినకాడికి దోచుకున్నది కాకుండా కలెక్టర్‌కి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించిన ఓ విషయం నెట్టింట వైరల్‌ అవుతోంది.

మధ్యప్రదేశ్‌లోని ఓ డిప్యూటీ కలెక్టర్ ఇంటికి చోరీకి వచ్చారు దొంగలు. దొరికినంతవరకూ డబ్బు, ఆభరణాలు దోచుకున్నారు. అంతటితో సంతృప్తి చెందని దొంగలు ఆ కలెక్టర్‌కి ఒక లేఖ రాసి అక్కడ పెట్టి వెళ్లిపోయారు. అర్ధమైందా చోరీ ఎక్కడ జరిగిందో… ఓ డిప్యూటీ కలెక్టర్‌ ఇంట్లో… దేవాస్ సివిల్ లైన్స్ ప్రాంతంలో డిప్యూటీ కలెక్టర్ త్రిలోచన్ గౌర్ అధికారిక నివాసముంది. గౌర్ ప్రస్తుతం ఖటేగావ్‌ ఎస్‌డిఎమ్‌గా ఉన్నారు. అతని భార్య రత్లాంలో మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ విధులకు వెళ్లి శని, ఆదివారాలలో ఈ ఇంటికి వస్తుంటారు. ఈ క్రమంలో అక్టోబరు 9న ఇంటికి వచ్చిన గౌర్‌ దంపతులు ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోని వస్తువులన్నీచెల్లాచెదురై పడిఉండటంతో చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారమిచ్చారు డిప్యూటీ కలెక్టర్‌. రంగంలోకి దిగిన పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించగా అక్కడ ఒక లేఖ దొరికింది. ఆ లేఖలో ఏముందో తెలుసా.. ఇంట్లో డబ్బులు లేకపోతే తాళం ఎందుకు వేశారు.. అని ప్రశ్నిస్తూ దొంగలు డిప్యూటీ కలెక్టరు లేఖ రాసి అక్కడ వదిలి వెళ్లారు. ఈ లేఖ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఇన్‌స్పెక్టర్ ఉమ్రావ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Tirupati: స్మశానం కబ్జా..మహిళ అంత్యక్రియలకు అడ్డంకి.. ఉద్రిక్తత వాతావరణం.. చివరికి ఎం జరిగింది..?(వీడియో)

 Water in Theater: శివగంగ థియేటర్‌లో పొంగిన గంగ.. వైరల్ అవుతున్న వీడియో..

 Gorilla in caretakers lap: సంరక్షుడి ఒడిలో ప్రాణాలొదిన సెలబ్రిటీ గొరిల్లా.. హృదయాలను కదిలిస్తున్న గొరిల్లా మరణం వీడియో..

 News Watch: కోతలొద్దు, మా వాటా వాడుకోండి , తొందర్లోనే పిల్లలకు టీకా.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

Follow us on