Viral: రిక్షా కార్మికుడి పట్ల యువతి సహృదయం.. ఏం చేసిందంటే!

మండుటెండలో రోడ్డుపై నడిచి వెళ్తేనే చెమటలు కారిపోతాయి.. అలాంటిది ఎండలో కాయకష్టం చేసే రిక్షా కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. అందుకే ఓ యువతి వారిపట్ల పెద్ద మనసు చాటుకుంది. బ్రిడ్జిపై రిక్షా తొక్కలేక అవస్థ పడుతున్న ఓ కార్మికుడికి చిరుసాయం చేసింది. బ్రిడ్జిపైకి రిక్షా సులువుగా ఎక్కేలా వెనక నుంచి ముందుకు తోసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Viral: రిక్షా కార్మికుడి పట్ల యువతి సహృదయం.. ఏం చేసిందంటే!

|

Updated on: Jun 07, 2024 | 10:46 PM

మండుటెండలో రోడ్డుపై నడిచి వెళ్తేనే చెమటలు కారిపోతాయి.. అలాంటిది ఎండలో కాయకష్టం చేసే రిక్షా కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. అందుకే ఓ యువతి వారిపట్ల పెద్ద మనసు చాటుకుంది. బ్రిడ్జిపై రిక్షా తొక్కలేక అవస్థ పడుతున్న ఓ కార్మికుడికి చిరుసాయం చేసింది. బ్రిడ్జిపైకి రిక్షా సులువుగా ఎక్కేలా వెనక నుంచి ముందుకు తోసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఓ కార్మికుడు పెద్ద కూలర్ ను తన రిక్షాలో వేసుకొని బ్రిడ్జిపై లాక్కెళ్తున్నాడు. అతను దానిని లాగ లేక లాగలేక లాగుతుంటే అటుగా వెళ్తున్న యువతి అది చూసి వెంటనే స్పందించింది. ఆ కార్మికుడు రిక్షాను సులువుగా లాగేలా అతనికి సాయం చేసింది. రిక్షాను వెనుకనుంచి ముందుకు నెట్టింది. చివరకు బ్రిడ్జిపైకి రిక్షా చేరుకొని ఏటవాలుగా కిందకు దిగే క్రమంలో ఓసారి ఆగాల్సిందిగా కార్మికుడిని ఆ యువతి కోరింది. అతను రిక్షా ఆపగానే చేతిలో లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ తోపాటు తలకు చుట్టుకోవడానికి టవల్ ను ఇచ్చింది. ఈ దృశ్యాన్ని అటుగా వెళ్తున్న మరొకరు వీడియో తీసి నెట్టింట పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ యువతిని ప్రశంసిస్తున్నారు. ఒకవేళ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకే ఈ వీడియో పెట్టినా ఆమె మంచిపనే చేసిందని పేర్కొన్నారు. రీల్స్ కోసం అడ్డమైన వీడియోలు చేసే వారితో పోలిస్తే ఆమె చేసిన వీడియో ఎంతో నయమని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 5 లక్షలమందికి పైగా పైగా వీక్షించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us